News May 11, 2024
నేటితో ఎన్నికల ప్రచారానికి తెర

నేటితో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మైక్‌లు మూగబోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 57 రోజులుగా ఎన్నికల ప్రచారం కొనసాగింది. కాగా బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు.
Similar News
News November 19, 2025
పుట్టపర్తికి మోదీ… స్వాగతం పలికిన సీఎం

AP: శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుట్టపర్తికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయానికి చేరుకుని బాబా మందిరాన్ని, మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. కాసేపట్లో బాబా స్మారక నాణెం, స్టాంపులను విడుదల చేస్తారు.
News November 19, 2025
రాగి వస్తువులు ఇలా శుభ్రం..

ఇటీవలి కాలంలో రాగి పాత్రల వాడకం ఎక్కువైంది. వీటిని శుభ్రం చేయడం పెద్ద టాస్క్. దాని కోసం కొన్ని టిప్స్. శనగపిండి, పెరుగు, ఉప్పు కలిపి ఆ మిశ్రమంతో రాగి పాత్రలను రుద్దితే మెరిసిపోతాయి. చెంచా ఉప్పుకి, రెండు చెంచాల వెనిగర్ కలిపి ఆ మిశ్రమంతో ఈ వస్తువులను తోమండి. మునుపటిలా తిరిగి తళతళలాడటం మీరే గమనిస్తారు. అలాగే నిమ్మరసం, ఉప్పు, బేకింగ్ సోడా కలిపి తోమినా కొత్తవాటిలా కనిపిస్తాయి.
News November 19, 2025
ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 13 మంది మృతి

దక్షిణ లెబనాన్‌లోని పాలస్తీనా శరణార్థి శిబిరం సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా, నలుగురు గాయపడినట్లు లెబనాన్ ప్రకటించింది. ఐన్ ఎల్-హిల్వే ప్రాంతంలో ఆయుధాలతో ఉన్న హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే అక్కడ ఎలాంటి సాయుధ బలగాలు లేవని లెబనాన్ పేర్కొంది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతి పెద్ద దాడిగా తెలుస్తోంది.


