News April 18, 2024

రేపటి నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం

image

TG: టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రేపటి నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రేపు సాయంత్రం మహబూబాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఎల్లుండి కర్ణాటకలో ప్రచారం చేస్తారు. 22న ఆదిలాబాద్, 23న నాగర్ కర్నూల్, 24న ఉదయం జహీరాబాద్, సాయంత్రం వరంగల్‌లో జరగనున్న బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.

Similar News

News September 17, 2025

చరిత్రాత్మక ఘట్టం.. పార్టీకో పేరు!

image

TG: నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ 1948, SEP 17న భారత సమాఖ్యలో విలీనమైంది. ఈ చరిత్రాత్మక రోజును ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో నిర్వహిస్తోంది. గత BRS ప్రభుత్వం ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ అని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ‘ప్రజా పాలన దినోత్సవం’ అని పేర్లు పెట్టాయి. అటు BJP నేతృత్వంలోని కేంద్రం ఐదేళ్లుగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ పేరిట వేడుకలు నిర్వహిస్తోంది. పేరేదైనా.. ఉద్దేశం అమరులను స్మరించుకోవడమే.

News September 17, 2025

మహిళల ఆరోగ్యం కోసం కొత్త కార్యక్రమం

image

నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా మహిళల ఆరోగ్యం కోసం కేంద్రం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ పేరిట హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 2 వరకు మహిళలకు పలు వైద్య పరీక్షలు చేస్తారు. PHC మొదలు బోధనా ఆస్పత్రుల వరకు 15 రోజులపాటు ఈ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నేడు మధ్యప్రదేశ్‌లో ప్రారంభించనున్నారు.

News September 17, 2025

రాష్ట్ర‌వ్యాప్తంగా IT అధికారుల సోదాలు

image

TG: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో IT అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ బంగారు దుకాణాల యజమానులే లక్ష్యంగా వారి ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. బంగారం లావాదేవీలు, ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలపై సోదాలు చేస్తున్నట్లు సమాచారం. వరంగల్‌లోనూ తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.