News April 7, 2024
ఎలక్షన్ కోడ్: తెలంగాణలో ఎంత సొమ్ము పట్టుబడిందంటే?

TG: ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ₹49.2కోట్ల విలువైన నగదు, మద్యం, వస్తువులు పట్టుబడినట్లు DGP రవి గుప్తా వెల్లడించారు. ఇందులో ₹31.12కోట్ల నగదు, ₹3.21కోట్ల విలువైన మద్యం, ₹5.41కోట్ల నార్కొటిక్ డ్రగ్స్, ₹7.66 కోట్ల విలువైన 16.9kgs బంగారం, 36.5kgs సిల్వర్, ₹1.62కోట్ల వస్తువులు ఉన్నాయన్నారు. 6,647 లైసెన్స్ ఉన్న, 8 లైసెన్స్ లేని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News November 7, 2025
పనులు ఆపేస్తాం.. ప్రభుత్వానికి బిల్డర్ల అల్టిమేటం

TG: రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న రూ.36వేల కోట్ల బిల్లులను ఈ నెలాఖరులోగా చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. లేదంటే డిసెంబర్ 1 నుంచి అన్ని శాఖల పరిధిలో సివిల్ వర్క్స్ నిలిపివేస్తామని స్పష్టం చేసింది. కాంట్రాక్టర్లు ఆస్తులను తాకట్టు పెట్టి పనులు చేశారని, వారి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
News November 7, 2025
ఇవాళ ‘SSMB29’లో పృథ్వీరాజ్ లుక్ రిలీజ్: రాజమౌళి

సూపర్ స్టార్ మహేశ్బాబుతో తీస్తోన్న SSMB29 చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ షూట్ జరుగుతున్నట్లు డైరెక్టర్ రాజమౌళి వెల్లడించారు. ఇదే సమయంలో ఈనెల 15న జరగనున్న ‘GlobeTrotter’ ఈవెంట్ కోసమూ భారీగా సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ‘ఈ ఈవెంట్ వరకు వేచి ఉండలేం. అందుకే ఈ వారాన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నింపుతాం. అందులో భాగంగానే ఇవాళ పృథ్వీరాజ్ లుక్ రిలీజ్ చేస్తాం’ అని ట్వీట్ చేశారు.
News November 7, 2025
SECLలో 543 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

సౌత్ ఈస్ట్రర్న్ కోల్ఫీల్డ్స్ (SECL)లో 543 అసిస్టెంట్ ఫోర్మెన్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్ పాసై ఉండాలి. డిపార్ట్మెంట్ అభ్యర్థులకు 3ఏళ్ల అనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://secl-cil.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి


