News March 16, 2024

కడప జిల్లాలో ఎన్నికల కోడ్.. కలెక్టర్, ఎస్పీ సమావేశం

image

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగడంతో కడప జిల్లాలో ఎన్నికల కోడ్ తక్షణమే అమలులోకి వచ్చింది. దీనిపై జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కలెక్టర్ కార్యాలయంలో మరికాసేపట్లో కీలక మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగే ఎన్నికల నిర్వహణ సంబంధించి పలు విషయాలను కలెక్టరు, ఎస్పీ వెల్లడిస్తారు.

Similar News

News September 3, 2025

జగన్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా ప్లకార్డులు

image

YSR వర్ధంతి వేడుకలకు, జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ సీఎం YS జగన్ పర్యటనలో మహిళలు ప్రదర్శించిన ప్లకార్డు ప్రత్యేకంగా నిలిచింది. మంగళవారం ఉదయం జగన్ పులివెందుల పర్యటనలో ఓటర్ల స్వేచ్ఛను హరించిన చంద్రబాబు అని మహిళలు ప్లకార్డును ప్రదర్శించారు. మహిళలు ప్రదర్శించిన ప్లకార్డు వైపు జగన్ ఆసక్తిగా చూశారు.

News September 2, 2025

కడప: అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచాలని మంత్రి లోకేశ్‌కు వినతి

image

అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచి ఆదుకోవాలని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి అన్నారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి లోకేశ్‌ను అంగన్వాడీలు కలిశారు. అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం ఏర్పాటు చేయాలని, వేతనాలు పెంచాలని కోరారు. ఇoదుకు స్పందించిన మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవ్వగానే వేతనాలు పెంచుతామన్నారు.

News September 2, 2025

చింతకొమ్మదిన్నె: ‘విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి లోకేశ్

image

చింతకొమ్మదిన్నె మండలంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన స్థానిక పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ, వారి ఆశయాలు, లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల సందేహాలకు సమాధానమిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు గురించి వివరించారు. విద్యార్థులు మంత్రి మాటలతో ఉత్సాహం పొందారు.