News April 21, 2025
ఎన్నికల కమిషన్ రాజీపడింది: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల కమిషన్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. USలోని బోస్టన్‌లో పర్యటిస్తున్న ఆయన అక్కడ ఓ ఈవెంట్‌లో మాట్లాడారు. ‘భారత ఎన్నికల కమిషన్ రాజీపడింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇది స్పష్టమైంది. రాష్ట్రంలో 18ఏళ్లు నిండినవారి కంటే పోలైన ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. అది అసాధ్యం. పోలింగ్ కేంద్రాల్లోని వీడియో ఫుటేజ్ చూసే వీల్లేకుండా చట్టాన్ని కూడా మార్చేశారు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News August 5, 2025
పవన్ సార్.. మీరు పక్కనుంటే కరెంటు పాకినట్టే: హరీశ్ శంకర్

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో షూటింగ్ పూర్తయినట్లు హరీశ్ తాజాగా ప్రకటించారు. ‘మాటిస్తే నిలబెట్టుకుంటారు. మాట మీదే నిలబడతారు. మీరు పక్కనుంటే కరెంటు పాకినట్టే. ఈరోజు ఎప్పటికీ గుర్తుంటుంది’ అని పేర్కొంటూ హీరోతో తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. పవన్ అందించిన ఎనర్జీ, సపోర్ట్‌తో షూటింగ్‌ను పూర్తి చేశామన్నారు.
News August 5, 2025
భారత్‌లో ‘టెస్లా’ రెండో షో రూమ్.. ఎక్కడంటే?

ఎలాన్ మస్క్ ‘టెస్లా’ కంపెనీ భారత్‌లో రెండో షో రూమ్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 11న ఢిల్లీలో షో రూమ్‌ను ఓపెన్ చేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ EV సంస్థ గత నెల 15న ముంబైలో తొలి షోరూమ్‌ను ప్రారంభించింది. మోడల్ Y SUVని రెండు వెర్షన్లలో లాంచ్ చేసింది. ఇందులో రియర్-వీల్ డ్రైవ్ కారు బేస్ ప్రైస్ రూ.59.89 లక్షలు, లాంగ్-రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ బేస్ ప్రైస్ రూ.67.89 లక్షలుగా ఉంది.
News August 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.