News June 11, 2024

10 రాజ్యసభ MP సీట్లకు త్వరలో ఎన్నిక?

image

దేశవ్యాప్తంగా 10 మంది రాజ్యసభ ఎంపీలు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో ఆ 10 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. అస్సాం నుంచి కామాఖ్య ప్రసాద్& శ‌ర్బానంద సోనోవాల్, బిహార్ నుంచి మిసా భారతి & వివేక్ ఠాకూర్, హరియాణా నుంచి దీపేందర్ సింగ్ హుడా, MP నుంచి జ్యోతిరాదిత్య సింధియా, MH నుంచి ఉదయన్రాజే భోంస్లే & పీయూష్ గోయల్, RJ నుంచి కేసీ వేణుగోపాల్, త్రిపుర నుంచి బిప్లవ్ కుమార్ దేవ్ లోక్‌సభ MPలుగా గెలిచారు.

Similar News

News December 23, 2024

ఘనంగా పీవీ సింధు వివాహం

image

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం ఉదయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు ఘనంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో ఏడడుగులు నడిచారు. ఈ వేడుకకు దాదాపు 140 మంది అతిథులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. వివాహ ఫొటోలను ఇరు ఫ్యామిలీలు ఇంకా విడుదల చేయలేదు. రేపు హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు.

News December 23, 2024

జనవరిలో దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు

image

వచ్చే నెల 20 నుంచి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సుకు భారత్ నుంచి ముగ్గురు సీఎంలు హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఇందులో పాల్గొంటారు. వీరితో పాటు ఏపీ మంత్రి లోకేశ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, TN మంత్రి టీఆర్‌బీ రాజా, యూపీ మంత్రి సురేశ్ ఖన్నా తదితరులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు.

News December 23, 2024

అమెరికా జట్టు కెప్టెన్‌గా తెలుగమ్మాయి

image

వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేషియా వేదికగా అండర్-19 టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ జరగనుంది. ఇందులో పాల్గొనే అమెరికా జట్టుకు తెలుగు యువతి కొలన్ అనికా రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. తెలుగు సంతతికి చెందిన చేతనారెడ్డి, ఇమ్మడి శాన్వి, సాషా వల్లభనేని కూడా అమెరికా తరఫున బరిలో దిగనున్నారు. జట్టులోని 15 మందిలో దాదాపు అందరూ ఇతర దేశాల సంతతికి చెందిన వారే కావడం గమనార్హం.