News September 19, 2024
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక.. టీడీపీలో పోటీ

AP: రెండు గ్రాడ్యుయేట్ MLC స్థానాలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో TDP అభ్యర్థిత్వం కోసం గట్టి పోటీ నెలకొంది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు స్థానానికి ఆలపాటి రాజేంద్ర, దేవినేని ఉమ, తాళ్ల వెంకటేశ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే ఆలపాటికే సీటు ఖాయమైనట్లు సమాచారం. ఇక ఉభయగోదావరి జిల్లాల స్థానానికి కేఎస్ జవహర్, బొడ్డు వెంకట రమణ, పేరాబత్తుల రాజశేఖర్, మంతెన రామరాజు టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 24, 2026
అధిక పాలిచ్చే పశువుకు ఉండే మరికొన్ని లక్షణాలు

పాడి పశువు నుంచి పాలు పిండిన తర్వాత పొదుగు ఒక రబ్బరు బుడగ గాలి తీసివేస్తే ఎలా అవుతుందో అలా అయిపోవాలి. అలా అవ్వని పొదుగును కండపొదుగు అంటారు. ఇది అధిక పాల దిగుబడికి పనికిరాదు. అంతేకాక పొదుగు మీద కనపడే రక్తనాళాలను గమనించాలి. వీటిని పాల సిరలు అంటారు. ఇవి పెద్దవిగా, ఎక్కువ పొడవుగా ఉండాలి. అలా ఉంటే పొదుగుకు అధిక రక్త సరఫరా జరిగి, పాల దిగుబడి పెరుగుతుంది. పొదుగు మీద చర్మం కూడా పలుచగా ఉండాలి.
News January 24, 2026
రేపు రథ సప్తమి.. ఇలా చేస్తే ఆయురారోగ్యాలు!

రేపు మాఘ శుద్ధ సప్తమి. ఆరోగ్య కారకుడైన సూర్యుడు జన్మించిన రోజు. రేపు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అరుణోదయ స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, సూర్య నమస్కారాలు చేయాలని సూచిస్తున్నారు. ఆదిత్య హృదయం పఠిస్తే ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని నమ్మకం. అరుణోదయ స్నానం ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 24, 2026
మహిళల్లోనే ఎక్కువగా కంటి సమస్యలు

పురుషులతో పోలిస్తే మహిళల్లోనే కంటి సంబంధిత సమస్యలు ఎక్కువని యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో అధ్యయనం వెల్లడించింది. హార్మోన్ సమస్యలు, ప్రెగ్నెన్సీలో శరీరంలో నీటి పరిమాణం పెరిగి కార్నియా మందంగా మారడం, డయాబెటిక్ రెటినోపతి వల్ల కంటిలోని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. అలాగే మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం కూడా కంటి సమస్యలకు మరో కారణమని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.


