News September 8, 2024

ACA అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నిక

image

AP: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ACA) అధ్యక్షుడిగా MP కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీశ్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా విష్ణుతేజ్ ఎన్నికైనట్లు తెలిపారు. ACA తొలి నిర్ణయంగా సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు శివనాథ్ వెల్లడించారు.

Similar News

News November 27, 2025

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో KCR మాజీ ఓఎస్డీ విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ CM KCR వద్ద OSDగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని జూబ్లీహిల్స్ PSలో సిట్ విచారిస్తోంది. దీంతో ఆయన ఎలాంటి సమాచారం ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. INC ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి సారించింది. ఈ కేసులో మాజీ IPS ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించింది. పలువురు రాజకీయ ప్రముఖుల వాంగ్మూలాలను సిట్ రికార్డ్ చేసింది.

News November 27, 2025

రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రివ్యూ&రేటింగ్

image

హీరో కష్టాన్ని తీర్చేందుకు అభిమాని ఏం త్యాగం చేశాడనేదే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ స్టోరీ. ఫ్యాన్ బయోపిక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరో పాత్రలో ఉపేంద్ర, అభిమాని రోల్‌లో రామ్ అద్భుతంగా నటించారు. రామ్, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. సాంగ్స్, ఎమోషనల్ సీన్లు ప్లస్ కాగా లెన్తీ, ఊహించే సీన్లు, స్లో నరేషన్ మైనస్.
రేటింగ్- 2.75/5

News November 27, 2025

పార్టీ నిర్ణయిస్తే సీఎంగా డీకేను స్వాగతిస్తాం: పరమేశ్వర

image

కర్ణాటకలో CM మార్పుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను కూడా సీఎం ఆశావహుల్లో ఉన్నా. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కూడా ఆ పదవికి తగిన అభ్యర్థే. కానీ ఆ పోస్టుకు హైకమాండ్ DK శివకుమార్‌ను నిర్ణయిస్తే స్వాగతిస్తాం. పార్టీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో అధిష్ఠానానికి తెలుసు. ప్రస్తుత సీఎం సిద్దరామయ్య, డీకే మధ్య డీల్ గురించి నాకు తెలియదు’ అని పేర్కొన్నారు.