News November 21, 2024
పీఏసీ ఛైర్మన్ ఎన్నిక.. సర్వత్రా ఉత్కంఠ

AP అసెంబ్లీలో PAC ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షానికి ఈ పదవిని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుండగా, సభ్యుడి ఎన్నికకు 18 ఓట్లు అవసరం. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో ఇవాళ నామినేషన్ వేస్తారా? లేదా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జగన్కు ప్రతిపక్ష హోదా దక్కలేదని అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలు PAC ఛైర్మన్ పదవి అంశంలో ఎలా ముందుకెళ్తారో చూడాలి.
Similar News
News November 26, 2025
HYD: ఈషా సింగ్ను అభినందించిన ఏడీజీ

ఉమెన్ షూటర్ ఈషా సింగ్ డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీపీ మహేష్ భగవత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కైరోలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం, 2 రజతాలతో మెరిసిన ఈషాను అధికారులు అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల నుంచి 700 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీలో ఆమె సాధించిన విజయం పట్ల భగవత్ శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
News November 25, 2025
హీరోల రెమ్యునరేషన్ తగ్గిస్తే టికెట్ రేట్లు ఎందుకు పెరుగుతాయ్?

సినిమా టికెట్ రేట్ల పెరుగుదలకు టాప్ హీరోల రెమ్యునరేషనే ప్రధాన కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అగ్ర హీరోలు ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు తీసుకుంటున్నారు. దీనివల్లే బడ్జెట్ పెరుగుతోందని, పెట్టిన డబ్బులు రాబట్టేందుకు నిర్మాతలు ప్రేక్షకులపై టికెట్ల భారం మోపుతున్నారని చెబుతున్నారు. అలాగే థియేటర్లలో స్నాక్స్ రేట్లను కంట్రోల్ చేయాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 25, 2025
శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

రష్యాతో పీస్ డీల్కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.


