News June 26, 2024
నేడు లోక్సభ స్పీకర్ ఎన్నిక

లోక్సభ స్పీకర్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. 50 ఏళ్ల తర్వాత ఈ పదవి కోసం ఎన్నిక జరుగుతోంది. NDA అభ్యర్థిగా ఓం బిర్లా, ఇండియా కూటమి అభ్యర్థిగా కే సురేశ్ పోటీ పడుతున్నారు. కాగా తొలిసారిగా 1952లో స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. అందులో శాంతారామ్ (55)పై మౌలాంకర్ (394) విజయం సాధించారు. ఆ తర్వాత 1976లో జగన్నాథ్ రావుపై బలిరామ్ భగత్ 344 ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పుడు మళ్లీ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతోంది.
Similar News
News December 7, 2025
లేటెస్ట్ సినిమా అప్డేట్స్

⋆ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫస్ట్ సాంగ్ ప్రోమో ఈ నెల 9న విడుదల.. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
⋆ ‘ఆవేశం’ డైరెక్టర్ జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా మూవీ.. కీలక పాత్రల్లో నటించనున్న నజ్రియా నజీమ్, నస్లేన్.. ఈరోజు పూజా కార్యక్రమం పూర్తి
⋆ రణ్వీర్ సింగ్ ‘దురంధర్’ సినిమాకు 2 రోజుల్లో రూ.61.70కోట్ల కలెక్షన్స్
News December 7, 2025
నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి సమ్మిట్ తర్వాత మరో లెక్క: సీఎం రేవంత్

TG: సీఎంగా ప్రమాణం చేసి నేటితో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, ఉచిత బస్సు, రూ.500కే గ్యాస్ తదితర పథకాలన్నీ సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు. నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క. ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు TELANGANA RISINGకు తిరుగు లేదు’ అని ట్వీట్ చేశారు.
News December 7, 2025
రెండో విడత.. 415 స్థానాలు ఏకగ్రీవం

TG: గ్రామపంచాయతీ ఎన్నికల్లో రెండో విడత నామినేషన్లలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాల్లో 415 చోట్ల ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా కామారెడ్డిలో 44 అయ్యాయని తెలిపింది. అటు 38,322 వార్డు స్థానాల్లో 8,304 చోట్ల ఏకగ్రీవమయ్యాయని పేర్కొంది. మిగతా 3,911 సర్పంచ్ స్థానాల్లో 13,128 మంది పోటీ పడుతుండగా 29,903 చోట్ల 78,158 మంది బరిలో ఉన్నారని తెలిపింది. ఈ నెల 14న పోలింగ్ జరగనుంది.


