News December 13, 2024

రాజ్యసభకు ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవం

image

ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలకు జరిగిన రాజ్యసభ ఉపఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్‌ రావు, సానా సతీశ్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో పోటీ లేకపోవడంతో రాజ్యసభకు వీరి ఎన్నిక లాంఛనమైంది. ఎన్నికైన అభ్యర్థులు శుక్రవారం ఆర్వో నుంచి ధ్రువీకరణపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్యను బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు గవ్వల భరత్ తదితరులు సన్మానించారు.

Similar News

News February 6, 2026

ముహూర్తం కోసం చూస్తున్నా.. 3 నెలల్లో పార్టీ ప్రకటన: కవిత

image

TG: పార్టీ ప్రకటనపై జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ‘నాకు సెంటిమెంట్ ఎక్కువ. మంచి ముహూర్తం కోసం చూస్తున్నా. 3 నెలల్లో పార్టీని ప్రకటిస్తా. సిరిసిల్లలో 16 మంది BRS నేతలు టికెట్ కోసం మమ్మల్ని కలిశారు. మున్సిపల్ ఎన్నికల్లో KTR, హరీశ్‌రావు కేవలం జాగృతి బరిలో ఉన్న చోటే తిరుగుతున్నారు. ఇతర జిల్లాల్లో ఎందుకు ప్రచారం చేయట్లేదో చెప్పాలి’ అని పేర్కొన్నారు.

News February 6, 2026

ప్రత్యామ్నాయాలు చూసుకోండి.. కోడర్స్‌కు వెంబు హెచ్చరిక

image

ప్రపంచమంతా AI యుగంలో దూసుకుపోతున్న నేపథ్యంలో కోడింగ్‌పై ఆధారపడే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన సమయం వచ్చిందని జోహో కో-ఫౌండర్ శ్రీధర్ వెంబు హెచ్చరించారు. కోడింగ్ తెలియని వారు కూడా AIతో యాప్స్‌ తయారు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఓ యూజర్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మార్పుని అంగీకరించాలని సూచించారు. AI బాధితుల జాబితాలో తాను కూడా ఉన్నానని తెలిపారు.

News February 6, 2026

‘బంగారు లేడి’ని కోరుకోకండి!

image

రామాయణంలో బంగారు లేడి కథ తెలిసిందే! సీతమ్మ ఆ మాయా లేడిని కోరడం వల్ల ఎన్నో కష్టాలొచ్చాయి. దీన్ని నేటి కాలం పాఠంగా భావించవచ్చు. మన జీవితంలోనూ కొన్ని వస్తువులు, సంబంధాలు బంగారు లేడిలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ, అవి తాత్కాలిక భ్రమలే కావచ్చు. విచక్షణ లేని కోరికలు లక్ష్యాన్ని దూరం చేస్తాయి. అందుకే ఆకర్షణలకు దూరముండాలి. కోరిక వెనుకున్న వాస్తవాన్ని గ్రహించాలి. అప్పుడే శాంతిని, సుఖాన్ని పొందగలం.