News October 22, 2024

సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ షురూ

image

ఏపీలో సాగునీటి సంఘాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 28.22 లక్షల ఆయకట్టును పర్యవేక్షించేందుకు గాను 6,149 సాగునీటి సంఘాలకు, 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు, 53 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులు ఆయా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. వారు సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. NOV 20న నోటిఫికేషన్ జారీ చేసి 27 నాటికి ప్రక్రియ ముగిస్తారు.

Similar News

News October 22, 2024

అయ్యప్ప భక్తుల కోసం IRCTC రైలు

image

అయ్యప్ప భక్తుల కోసం IRCTC తొలిసారిగా భారత్ గౌరవ్ రైలును తీసుకొచ్చింది. ఈ రైలులో వెళ్లి శబరిమల, చొట్టనిక్కర భగవతీ దేవి ఆలయాలు చూడవచ్చు. NOV 16న ఉ.8 గంటలకు SCలో బయల్దేరే ఈ రైలుకు NLG, పిడుగురాళ్ల, GNT, తెనాలి, OGL, NLR, గూడూరు, రేణిగుంట, TPTY, చిత్తూరులో రైలు ఎక్కొచ్చు. 5 పగళ్లు, 4 రాత్రులు రోడ్డు రవాణాతో పాటు టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ సౌకర్యాలు ఉంటాయి. స్లీపర్ ఛార్జ్ ₹11,475, థర్డ్ AC ₹18,790.

News October 22, 2024

INDతో రెండో టెస్టుకూ కేన్ మామ దూరం

image

న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ భారత్‌తో పుణేలో జరిగే రెండో టెస్టుకూ దూరమయ్యారు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆయన గాయపడిన విషయం తెలిసిందే. కేన్ పూర్తిగా కోలుకోకపోవడంతో నెక్స్ట్ టెస్టుకూ రెస్ట్ ఇస్తున్నట్లు కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు. నవంబర్ 1న ముంబైలో జరగనున్న మూడో టెస్టుకు విలియమ్సన్ ఆడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

News October 22, 2024

బుక్ ఫెయిర్‌కు వచ్చి బిర్యానీలు లాగించారు!

image

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో నిర్వహించిన బుక్ ఫెయిర్ కాస్తా ఫుడ్ ఫెస్ట్‌గా మారింది. సాహిత్యం- సంస్కృతిని ప్రోత్సహించేందుకు, బుక్స్ చదివే అలవాట్లను పెంపొందించేందుకు నిర్వాహకులు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనికి వేలాది మంది తరలిరాగా కేవలం 35 పుస్తకాలే అమ్ముడయ్యాయి. కానీ, 1200 షావర్మాలు, 800 బిర్యానీలు అమ్ముడయ్యాయి. దీంతో పుస్తకాల కంటే తిండే ముఖ్యమైందని నెట్టింట విమర్శలొస్తున్నాయి.