News June 3, 2024

‘ఎలక్షన్ ప్రూఫ్’ రంగాలివే!

image

స్టాక్ మార్కెట్లను విపరీతంగా ప్రభావితం చేయగల అంశాల్లో ఎన్నికలు కూడా ఉంటాయి. కొత్త ప్రభుత్వంలో పాలసీలు, నిర్ణయాల అంచనాలతో స్టాక్స్ ఒడుదొడుకులకు లోనవుతాయి. అయితే కొన్ని రంగాలపై అంతగా ప్రభావం ఉండదు. వాటిలో ఆటోమొబైల్స్, పవర్, టెక్నాలజీ, ఇన్సూరెన్స్, ఫెర్టిలైజర్స్&కెమికల్స్, టెలికాం, ఫార్మా, గ్లోబల్ కమోడిటీస్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి సమయంలోనైనా వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చని సూచిస్తున్నారు.

Similar News

News October 10, 2024

తూర్పుగోదావరిలో డ్రగ్స్ కలకలం.. నలుగురు అరెస్ట్

image

AP: నగరాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ పట్టణాలకూ విస్తరిస్తోంది. తాజాగా తూ.గో(D) భూపాలపట్నంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో జరిగిన బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. తాడేపల్లిగూడెంకు చెందిన నలుగురు యువకులు టెలిగ్రామ్‌లో కొకైన్ కొనుగోలు చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా టౌన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 4గ్రా. కొకైన్, 50గ్రా. గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.

News October 10, 2024

ఏపీకి వెళ్లాల్సిందే.. IASల విజ్ఞప్తిని తిరస్కరించిన కేంద్రం

image

తెలంగాణలోని ఏపీ కేడర్ IASలపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణలోనే కొనసాగించాలని రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి సహా 11 మంది IAS ఆఫీసర్లు విజ్ఞప్తి చేయగా కేంద్రం తిరస్కరించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది.

News October 10, 2024

దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్

image

2024 ఏడాదికిగానూ సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌ను నోబెల్ వ‌రించింది. మాన‌వ జీవితంలోని చ‌రిత్రాత్మ‌క సంఘ‌ర్ష‌ణ‌లు, దుర్భ‌ల‌త్వాన్ని క‌ళ్ల‌కు క‌డుతూ ఆమె రాసిన ప్ర‌భావ‌వంత‌మైన‌ క‌విత‌ల‌కు గుర్తింపుగా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారం దక్కింది. సియోల్‌లో స్థిరపడ్డ హాన్ సాహిత్యంతోపాటు, క‌ళ‌లు, సంగీతానికి జీవితాన్ని అంకితం చేశార‌ని ది స్వీడిష్ అకాడ‌మీ పేర్కొంది.