News November 16, 2024

ఎన్నిక‌ల స్లోగ‌న్‌.. అదే పార్టీల‌కు గ‌న్‌(1/2)

image

ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి, ప్ర‌త్య‌ర్థుల‌ను కార్నర్ చేయడానికి పార్టీలు అనుస‌రించే వ్యూహాల్లో ‘నినాదం’ కీల‌కం. MH, ఝార్ఖండ్ ఎన్నికల్లో BJP, కాంగ్రెస్ సంధించుకున్న నినాదాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. అవి: ఏక్ హైతో సేఫ్ హై(ఒక్క‌టిగా ఉంటే సుర‌క్షితంగా ఉంటాం-మోదీ) *బ‌టేంగే తో క‌టేంగే(విడిపోతే న‌ష్ట‌పోతాం- UP CM) *భ‌య‌ప‌డొద్దు- రాహుల్ గాంధీ *భ‌య‌ప‌డితే చ‌స్తారు- INC *రోటీ-బేటీ-ఔర్ మ‌ట్టి (ఝార్ఖండ్ BJP)

Similar News

News November 16, 2024

ISRO-SpaceX ప్ర‌యోగం.. త్వ‌ర‌లో విమానాల్లో ఇంట‌ర్నెట్ సేవ‌లు

image

అంతరిక్ష ప్రయోగాల్లో ISRO-SpaceX మొద‌టి సారి చేతులు క‌లిపాయి. ఇస్రో కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT-N2 ఉప‌గ్రహాన్ని ఫాల్క‌న్‌-9 రాకెట్‌ ద్వారా వ‌చ్చే వారం ప్ర‌యోగించ‌నున్నారు. 3000 మీట‌ర్ల ఎత్తులో ఉన్న విమానాల్లో సైతం ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని అందించ‌డానికి ఇస్రో ఈ ప్ర‌యోగాన్ని చేపట్టింది. GSLV Mk3 రాకెట్ 4 వేల KGల బ‌రువును మోయ‌గ‌ల‌దు. GSAT-N2 4700 KGలు ఉండ‌డంతో SpaceXతో ఇస్రో జ‌ట్టుక‌ట్టింది.

News November 16, 2024

‘కంగువా’ కలెక్షన్లు ఎంతంటే?

image

సూర్య, శివ కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడికల్ ఫాంటసీ ఫిల్మ్ ‘కంగువా’. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.89.32 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. అభిమానుల నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని పేర్కొంది.

News November 16, 2024

BREAKING: నటి కస్తూరి అరెస్ట్

image

తెలుగు వారిపై వివాదాస్పద <<14525601>>వ్యాఖ్యలు<<>> చేసిన నటి కస్తూరి అరెస్టయ్యారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో చెన్నై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించగా, హైదరాబాద్‌లో ఆచూకీ లభ్యమైంది. ఆమెను ప్రస్తుతం పోలీసులు చెన్నై తరలిస్తున్నారు.