News April 15, 2024
ELECTION STORY: నిజామాబాద్ అండ ఎవరికి?
నిజామాబాద్ లో ఈ సారి పోటీ రసవత్తరంగా ఉండబోతుంది. గత MP ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 6.53 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. BJPకి 45.31శాతం, BRSకు 38.62 శాతం ఓట్లు వచ్చాయి. మెున్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలో BJP మూడో స్థానానికి వెళ్లినా, ఓట్ల పరంగా కాంగ్రెస్, BRSలకు దగ్గరగానే ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు బలపడటంతో త్రిముఖ పోటీ నెలకొంది. మరీ ఎవరు గెలుస్తారో చూడాలి.. దీనిపై మీ కామెంట్
Similar News
News February 1, 2025
నవీపేట్: గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
నవీపేట్ మండలం ఎంచ గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ వినయ్ కుమార్ వివరాల ప్రకారం.. రావుల పెద్దయ్యకు ఇద్దరు భార్యలు ఉన్నారు. నవీపేట్ సుభాష్ నగర్‌కి చెందిన రెండో భార్య సవిత ప్రతిరోజూ గొడవ పడుతుండేది. ఆమె బంధువులు వచ్చి బెదిరించడంతో గొడవ ఏర్పడింది. దీంతో పెద్దయ్య ఆవేశంలో శుక్రవారం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తమ్ముడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 1, 2025
NZB: ఫేక్ యాప్‌తో మోసం.. ఇద్దరి అరెస్ట్
ఫేక్ యాప్‌లో ఆఫర్ల పేరిట అమాయకులను మోసం చేస్తున్న షేక్ అమిర్, సయ్యద్ ఇమ్రాన్ అలీ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి వివరాలు వెల్లడించారు. MGI యాప్ పేరుతో దాదాపుగా 12 మంది బాధితుల నుంచి రూ.2.40లక్షల నగదును కాజేశారని పేర్కొన్నారు. ఇలాంటి యాప్‌లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసు ఛేదనకు కృషి చేసిన పోలీసు అధికారులను ACP అభినందించారు.
News February 1, 2025
ధర్పల్లి: ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి
దుబ్బాక గ్రామానికి చెందిన బొల్లారం సాయిలు అనే వ్యక్తి యూరియా కోసం ట్రాక్టర్ పై ధర్పల్లికి వెళ్తూ గ్రామ శివారులోని పసుపు పరిశోధన కేంద్రం సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో సాయిలు(52) అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ధర్పల్లి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.