News April 15, 2024

ELECTION STORY: ఆదిలాబాద్‌లో గెలుపేవరిదో..?

image

ADB లోక్‌సభ స్థానాన్ని 2019లో BJP గెలుచుకుంది. ఈ పార్టీకి 35.92 శాతం ఓట్లు వచ్చాయి. BRSకు 30.34, కాంగ్రెస్‌కు 29.91 ఓట్లు లభించాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు35.62 ఓట్లు వస్తే, BJPకి 34.32, కాంగ్రెస్‌కి కేవలం 19.26 శాతం ఓట్లు దక్కాయి. ఏడు సెగ్మెంట్లలో 4 బీజేపీ, రెండు బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ప్రస్తుతం ADBలో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఎవరు గెలుస్తారో చూడాలి. దీనిపై మీ కామెంట్

Similar News

News March 5, 2025

ASF: భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

image

గత రెండు రోజుల క్రితం మండలం లోడుపల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద మృతి విషయం తెలిసిందే. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లుగా సీఐ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఎంకపల్లి బస్టాండ్ వద్ద భర్త గణేశ్, అతని తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించానని చెప్పినట్లు SI కొమురయ్య తెలిపారు.

News March 5, 2025

ఆదిలాబాద్: ఇద్దరు మహిళా దొంగలు ARREST

image

ఇద్దరు మహిళా దొంగలను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాలు.. మహారాష్ట్రకు చెందిన మైనా, జ్యోతి, వీరి భర్త తేజ్ షిండే మహారాష్ట్ర నుంచి రైలులో ఆదిలాబాద్ వచ్చి చోరీలు చేస్తూ తిరిగి వెళ్లిపోతున్నారు. మంగళవారం బస్టాండ్‌లో అనుమానస్పదంగా తిరుగుతుండగా ఆ ఇద్దరు మహిళలను SIవిష్ణుప్రకాశ్ అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. పరారీలో ఉన్న తేజ్ షిండే కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

News March 5, 2025

ADB: పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు

image

ఇంటర్ పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వెలుపల ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉంటారని తెలియజేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసి ఉంచాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాలలోనికి సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదన్నారు.

error: Content is protected !!