News March 17, 2024

ఎలక్షన్ అప్డేట్స్: కడప జిల్లాలో అప్పుడు ఇప్పుడు వాళ్లే

image

2024 ఎన్నికల నగారా మోగింది. అటు కూటమి, ఇటు YCP అభ్యర్థుల ప్రకటలను చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ఈ సారి రాష్ట్రంలో చాలా మార్పులు చేశారు. కానీ.. వైఎస్‌ఆర్ జిల్లాలోనే ఎటువంటి మార్పులు లేవు. 2019 ఎన్నికల్లో నిలబడ్డ వారే ఇప్పుడు కూడా నిలబడుతున్నారు. TDP ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో మాధవిరెడ్డి, బీటెక్ రవి, పుత్తా చైతన్య రెడ్డి కొత్తగా బరిలో నిలబడుతున్నారు. వీరిలో ఎంతమంది విజయం సాధిస్తారో చూడాలి.

Similar News

News November 26, 2025

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ సంతకం

image

రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయన బుధవారం కోటి సంతకాల సేకరణ ఫారంపై సంతకం చేసి తన వ్యతిరేకతను తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

News November 26, 2025

ప్రొద్దుటూరులో బంగారు ధరలు ఇలా..

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బంగారు ధరలు బుధవారం ఇలా ఉన్నాయి.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.12,590
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.11,583
* వెండి 10 గ్రాములు ధర రూ.1,630 గా ఉంది.
నిన్న, ఈరోజుకి బంగారు ధరలో ఎలాంటి మార్పు లేదు. కానీ నిన్న వెండి 10 గ్రాములు రూ.1,616 ఉండగా నేడు రూ.1630లకు పెరిగింది.

News November 26, 2025

కడప జిల్లాలో 201 మంది హౌసింగ్ ఉద్యోగులకు జీతాలు నిలిపివేత

image

కడప జిల్లాలో 201 మంది హౌసింగ్ ఉద్యోగులకు నవంబర్ నెల జీతాలు నిలిపివేస్తూ ఆ శాఖ ఎండీ అరుణ్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ‘ఫేజ్-3’లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లోని లోపాలపై ఇటీవల పరిశీలన చేపట్టారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లాలో 6,298 ఇళ్ల నిర్మాణాలకు అదనపు చెల్లింపు జరిగినట్లు గుర్తించారు. ఇందుకు 30 మంది ఏఈఎస్‌లు, 171 మంది ఈఏ/డబ్ల్యూఏఎస్‌లను బాధ్యులను చేస్తూ ఈ చర్యలు తీసుకున్నారు.