News December 19, 2025

Elections: అతనికి ఒక్క ఓటు పడింది

image

ఎన్నికల్లో ఒక్క ఓటుతో గెలిచిన ఘటనలు చాలా ఉన్నాయి. అయితే అభ్యర్థికి ఒక్క ఓటే పోలైన సందర్భాలు అరుదు. తాజాగా కేరళలోని మన్నార్కడ్ మున్సిపాలిటీలోని ఫస్ట్ వార్డులో పోటీ చేసిన LDF మద్దతిచ్చిన ఇండిపెండెంట్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌కు ఒక్క ఓటే పడింది. అతనికి ఫ్యామిలీ మెంబర్ల ఓట్లు కూడా పడకపోవడం గమనార్హం. అక్కడ గెలిచిన IUML అభ్యర్థితో LDFకు డీల్‌ కుదిరిందనే ప్రచారం జరగగా కౌంటింగ్ తర్వాత అదే నిజమని తేలింది.

Similar News

News December 21, 2025

మంచిర్యాల: 3,700 కేసులు పరిష్కారం

image

మంచిర్యాల జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 9 లోక్ అదాలత్ బెంచ్‌లలో 3,700 కేసులు పరిష్కరించినట్లు జిల్లా అదనపు న్యాయమూర్తి లాల్ సింగ్ శ్రీనివాస నాయక్ తెలిపారు. 15 సివిల్ ధావాలు, 5 వాహన పరిహారం, 3, 650, క్రిమినల్, 33 సైబర్ క్రైమ్, 75 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు.

News December 21, 2025

బీజేపీకి భారీగా విరాళాలు

image

2024-25లో రాజకీయ పార్టీలకు ₹3,811 కోట్ల డొనేషన్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా 9 ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా ఇవి అందాయి. బీజేపీకి ఏకంగా ₹3,112 కోట్లు (82%) రావడం గమనార్హం. కాంగ్రెస్‌కు ₹299 కోట్లు(8%), ఇతర పార్టీలకు ₹400 కోట్లు (10%) వచ్చాయి. పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలివ్వడాన్ని సుప్రీంకోర్టు గతేడాది రద్దు చేసిన విషయం తెలిసిందే. 2023-24లో ₹1,218 కోట్ల విరాళాలు వచ్చాయి.

News December 21, 2025

20 రోజుల్లో మూడు సభలు నిర్వహించనున్న BRS

image

TG: రాబోయే 20 రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో మూడు సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. తొలుత మహబూబ్ నగర్(పాలమూరు) ఆ తర్వాత రంగారెడ్డి, నల్గొండలో సభలు నిర్వహించాలని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాల సాధనకై పోరు చేయాలని పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.