News April 22, 2024
ఎలక్షన్స్.. రాష్ట్రానికి మరో 100 కేంద్ర బలగాల కంపెనీలు

TG: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేస్తోంది. 60వేల మంది రాష్ట్ర పోలీసులకు తోడు 60 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో పాల్గొంటున్నాయి. మరో 100 కంపెనీలను పంపించాలని కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాసింది. మే మొదటి వారంలో ఆ బలగాలు రానున్నాయి. ఒక్కో కంపెనీలో 70-80 మంది ఉండే సిబ్బందిని.. అంతర్గత చెక్‌పోస్టులు, సరిహద్దులు, సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించనున్నారు.
Similar News
News January 25, 2026
ఆగాకర సాగు.. ఇలా నాటితే ఎక్కువ ప్రయోజనం

ఆగాకరను విత్తనం, దుంపలు, తీగ కత్తిరింపుల ద్వారా ప్రవర్థనం చేస్తారు. 2-3 సంవత్సరాల వయసుగల దుంపలు నాటుటకు అనుకూలం. తీగ కత్తిరింపుల ద్వారా అయితే 2-3 నెలల వయసున్న తీగ కత్తిరింపులను ఎంచుకోవాలి. విత్తనం ద్వారా నాటుకోవాలంటే గుంతకు 4-5 విత్తనాలు నాటుకోవాలి. ఇవి పూతకు వచ్చినప్పుడు మగ మొక్కలను తీసి గుంతకు 2-3 ఆరోగ్యవంతమైన ఆడ మొక్కలను ఉంచాలి. దుంపల ద్వారా నాటడం రైతులకు శ్రేయస్కరం.
News January 25, 2026
వినాయకుడి కడుపు చుట్టూ సర్పం ఎందుకు?

శివుడి తలపై ఉన్నాననే గర్వంతో ఉన్న ఆదిశేషుడిని శిక్షించేందుకు శివుడు నేలకేసి కొట్టాడు. ముక్కలైన తలతో బాధపడుతున్న శేషుడు, నారదుడి సలహాతో గణపతిని ప్రార్థించి పూర్వ రూపం పొందాడు. కృతజ్ఞతగా తనను ధరించమని శేషుడు కోరగా, వినాయకుడు అంగీకరించాడు. ఆ తర్వాత ఓసారి చంద్రుడి పరిహాసంతో గణపతి కడుపు పగిలింది. అప్పుడు మళ్లీ అలా జరగకుండా ఉండేందుకు ఇచ్చిన మాట ప్రకారం శేషుడిని కడుపు చుట్టూ దట్టిలా కట్టుకున్నాడు.
News January 25, 2026
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో 43 పోస్టులు

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ISI) కోల్‌కతాలో 43 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 21 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ ఆఫీసర్, ఎలక్ట్రీషియన్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: www.isical.ac.in


