News May 12, 2024
ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలివే!

AP: ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా 14 సెగ్మెంట్లను అధికారులు గుర్తించారు. మాచర్ల, ఆళ్లగడ్డ, పెదకూరపాడు, ఒంగోలు, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పీలేరు, పలమనేరు, రాయచోటి, తంబళ్లపల్లి తదితర నియోజకవర్గాలు వీటిలో ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి 28,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నారు. కాగా.. ఎన్నికల విధులకు 3.30 లక్షల మంది సిబ్బంది హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 5, 2025
విమానాల రద్దు.. ఈ విషయాలు తెలుసుకోండి!

3 రోజులుగా ఇండిగో విమాన <<18473431>>సర్వీసులు<<>> రద్దవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయాల్లో ఎయిర్‌లైన్స్ పాటించాల్సిన బాధ్యతలపై DGCA రూల్స్ జారీ చేసింది. ఆ ప్రకారం.. సర్వీసు రద్దయితే ముందే సమాచారం ఇవ్వాలి. ప్రత్యామ్నాయ విమానంలో ఫ్రీగా వెళ్లే ఏర్పాటు చేయాలి. ప్రయాణికులు కోరుకుంటే రీఫండ్ చేయాలి. 2గంటలకు మించి ఆలస్యమైతే భోజనం, ఫ్రెష్ అయ్యే సౌకర్యం కల్పించాలి. 24 గంటలు దాటితే ఫ్రీగా హోటల్, రవాణా ఏర్పాటు చేయాలి.
News December 5, 2025
పుతిన్‌కు ‘బాడీ డబుల్స్’ ఉన్నారా?

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఆయన ‘బాడీ డబుల్స్’ గురించి చర్చ జరుగుతోంది. బహిరంగ కార్యక్రమాలు, ప్రయాణాలకు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తారని ఊహాగానాలు ఉన్నాయి. పుతిన్‌కు ముగ్గురు డూప్స్ ఉన్నారని ఉక్రెయిన్ గతంలో చెప్పింది. వారు ‘క్లోన్ ఆర్మీ’ అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అవన్నీ అవాస్తవాలని, ‘బాడీ డబుల్’ ప్రతిపాదనలను తాను తిరస్కరించానని గతంలో పుతిన్ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.
News December 5, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<


