News March 16, 2024

ఎన్నికలు.. రాష్ట్రాలకు EC ఆదేశాలు

image

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాలకు EC కీలక ఆదేశాలు జారీ చేసింది. ‘పక్షపాతం లేకుండా అధికారులను ట్రాన్స్‌ఫర్ చేయాలి. పోలింగ్ సిబ్బందిని ర్యాండమ్‌గా ఎంపిక చేయాలి. నిబంధనలకు అనుగుణంగా పార్టీల ప్రచారాలకు అనుమతి ఇవ్వాలి. పోలింగ్ విధుల్లో వాలంటీర్లు, ఒప్పంద సిబ్బందికి అవకాశం ఇవ్వొద్దు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటును వినియోగించుకునేలా చూడాలి’ అని సూచించింది.

Similar News

News November 5, 2024

Wikiకి కేంద్రం నోటీసులు

image

అసత్య, పక్షపాత సమాచార అభియోగాలపై వికీపీడియాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వికీని పబ్లిషర్‌గా ఎందుకు గుర్తించకూడదో చెప్పాలని ఆదేశించింది. కాగా ఎవరైనా ఈ ప్లాట్‌ఫాంలో సమాచారం చేర్చే అవకాశం ఉండటంతో తాము పబ్లిషర్ కాదు అని వికీ గతంలో పేర్కొంది. పరిమిత ఎడిటోరియల్ టీమ్‌తో డేటాను మానిటర్ చేస్తున్నామని చెప్పింది. ANI బీజేపీ అనుకూల మీడియా అని పేర్కొనగా, సదరు సంస్థ కోర్టుకెక్కడంతో దీనిపై వివాదం మొదలైంది.

News November 5, 2024

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

AP: ఓ విలేకరి హత్య కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తుని నియోజకవర్గం తొండంగికి చెందిన విలేకరి సత్యనారాయణ 2019 అక్టోబర్‌లో హత్యకు గురయ్యారు. దీనికి సూత్రధారి దాడిశెట్టి రాజా అని మృతుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. దీంతో రాజా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.

News November 5, 2024

STOCK GAMESతో ఆటలొద్దు: సెబీ వార్నింగ్

image

లిస్టెడ్ కంపెనీల స్టాక్ ప్రైసెస్ ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ సర్వీసెస్, పేపర్ ట్రేడింగ్, ఫాంటసీ గేమ్స్ అందించే యాప్స్, వెబ్ అప్లికేషన్ల జోలికి పోవొద్దని సెబీ వార్నింగ్ ఇచ్చింది. అవి చట్టవిరుద్ధమని సూచించింది. తమ వద్ద రిజిస్టరైన అడ్వైజరీలను మాత్రమే ఫాలో అవ్వాలని తెలిపింది. వారి రిజిస్ట్రేషన్ సరైందో కాదో చెక్ చేసుకోవాలంది. స్టాక్ లీగ్స్, స్కీమ్స్, పోటీల జోలికెళ్లి బాధితులుగా మారొద్దని పేర్కొంది.