News February 17, 2025
‘తుని, పాలకొండ’ మున్సిపాలిటీ పదవుల ఎన్నిక వాయిదా

AP: తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. శాంతిభద్రతల సమస్య, కోరం లేకపోవడం కారణంగా వాయిదా వేసినట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. రేపు ఉదయం ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. అలాగే పాలకొండ నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక కూడా కోరం లేక మళ్లీ వాయిదా పడింది. మరోవైపు పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్గా ఉన్నం భారతి ఎన్నికయ్యారు. YCP నుంచి TDPలోకి వెళ్లిన ఆమెకు 17 మంది మద్దతు పలికారు.
Similar News
News October 28, 2025
మొంథా తుఫాను.. ఈ జిల్లాల్లో రాకపోకలు బంద్

AP: మొంథా తుఫాను నేపథ్యంలో కృష్ణా, ఏలూరు, తూ.గో., ప.గో., అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లలో రాకపోకలను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు రాత్రి 8PM నుంచి రేపు 6AM వరకు ఈ జిల్లాల్లోని నేషనల్ హైవేలతో పాటు అన్ని రోడ్లపై వాహనాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కేవలం మెడికల్ సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించారు.
News October 28, 2025
హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం

TG: హైదరాబాద్లో వర్షం దంచికొడుతోంది. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కూకట్పల్లి, మియాపూర్, నిజాంపేట్, అల్వాల్, కాప్రాలో వాన పడుతోంది. రాత్రి 7.30 గంటల్లోపు నగరమంతా వర్షం విస్తరిస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News October 28, 2025
సర్జరీ విజయవంతం.. కోలుకున్న శ్రేయస్!

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నారని Cricbuzz తెలిపింది. Spleen(ప్లీహం)కు గాయం కాగా సిడ్నీ వైద్యులు మైనర్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారని చెప్పింది. నిన్ననే ICU నుంచి బయటికొచ్చిన అయ్యర్ మరో 5 నుంచి 7 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్లు పేర్కొంది. ఇదే నిజమైతే అతడు త్వరలో మైదానంలో అడుగుపెట్టే ఛాన్సుంది.


