News March 23, 2025
వచ్చే నెలలో కెనడాలో ఎన్నికలు

కెనడాలోని 338 పార్లమెంటు స్థానాలకు వచ్చే నెల 28న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు కొత్త ప్రధాని కార్నీ త్వరలోనే ప్రకటన విడుదల చేయొచ్చని తెలుస్తోంది. కొత్త నాయకత్వం వచ్చాక అధికార లిబరల్ పార్టీవైపు ప్రజామోదం ఉన్నట్లు పలు సర్వేల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో పీఎం కార్నీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనట్లు సమాచారం.
Similar News
News March 25, 2025
IPL: నేడు గుజరాత్‌తో పంజాబ్ ఢీ

IPLలో ఇవాళ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచుల్లో తలపడ్డాయి. GT 3, PBKS 2 మ్యాచుల్లో గెలిచాయి. గత సీజన్‌లో KKRకు కప్ సాధించి పెట్టిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌లో PBKSకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. GTకి గిల్ కెప్టెన్‌గా ఉన్నారు. మరి ఈ మ్యాచులో గెలుపెవరిది? కామెంట్ చేయండి.
News March 25, 2025
తెలంగాణ రాష్ట్ర అప్పు ఎంతంటే?

తెలంగాణకు ₹4,42,298 కోట్ల అప్పులు ఉన్నాయని కేంద్రం లోక్ సభలో వెల్లడించింది. ఈ విషయంలో దేశంలో TG 24వ స్థానంలో ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అలాగే రాష్ట్రంలో గత 6 ఏళ్లలో 10,189 IT కంపెనీలు ప్రారంభమయ్యాయని కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రా తెలిపారు. ఇదే సమయంలో 3,369 సంస్థలు మూతపడ్డాయని పేర్కొన్నారు. ఈ కంపెనీల ద్వారా గత ఐదేళ్లలో ₹14,865కోట్ల టర్నోవర్ జరిగిందని వివరించారు.
News March 25, 2025
ఫూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి ఫూలేను భారతరత్నతో సత్కరించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా CM ఫడణవీస్ మాట్లాడుతూ ‘మహాత్మా బిరుదు దేశంలో అన్నింటికన్నా గొప్పది. దీనిని ప్రజలు ఫూలే, గాంధీకి మాత్రమే ఇచ్చారు’ అని పేర్కొన్నారు. ఫూలే దంపతులు 19వ శతాబ్దంలో బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.