News March 16, 2024
తెలంగాణలో మే 13న ఎన్నికలు

ఏపీతో పాటు తెలంగాణలో <<12866845>>ఒకేరోజు<<>> ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి కూడా మే 13న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Similar News
News October 14, 2025
ఏమిటీ పరకామణి కేసు-రాజీ వ్యవహారం..?

తిరుమల <<17999947>>పరకామణి<<>>లో 2023లో ఉద్యోగి రవికుమార్ దొంగతనం చేయడంపై CID విచారణ జరగాలని స్థానిక జర్నలిస్టు శ్రీనివాసులు గతేడాది HCలో పిటిషన్ వేశారు. ఈ చోరీపై 2023 APRలో పోలీసులకు ఫిర్యాదు చేసిన TTD విజిలెన్స్ ఆఫీసర్ సతీష్, SEPలో లోక్ అదాలత్‌లో రవితో రాజీ చేసుకున్నారని తెలిపారు. దీంతో అదాలత్ నిర్ణయాన్ని సస్పెండ్ చేసిన జస్టిస్ రామకృష్ణ.. ఖజానా రికార్డులు, రాజీ ఉత్తర్వుల సీజ్‌కు CIDని ఆదేశించినా ఆ పని చేయలేదు.
News October 14, 2025
ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ నాటి MD హరిరామ్ ఆస్తుల జప్తుకు ఇరిగేషన్ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. మర్కూక్‌లో 28, బొమ్మలరామారంలో 6ఎకరాలు, పటాన్చెరులో 20గుంటలు, షేక్‌పేట, కొండాపూర్‌లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, నార్సింగిలో 2 ఇళ్లు, ఫ్లాట్లు, కుత్బుల్లాపూర్, మిర్యాలగూడలో ప్లాట్లు, అమరావతిలో స్థలం, కొత్తగూడెంలో బిల్డింగ్‌ను జప్తు చేయనున్నారు.
News October 14, 2025
పోలీస్ శాఖను మూసేయడం బెటర్: హైకోర్టు అసంతృప్తి

ఏపీలో డీజీపీ, పోలీస్ శాఖ నిద్రావస్థలో ఉన్నాయని హైకోర్టు మండిపడింది. డిపార్టుమెంటును మూసేయడం మంచిదని అసంతృప్తి వ్యక్తం చేసింది. TTD పరకామణి విషయంలో లోక్ అదాలత్‌లో రాజీ రికార్డుల సీజ్‌కు HC SEP 19న ఆదేశాలిచ్చింది. CIDలో సీజ్ అధికారం గల IG పోస్టు ఖాళీగా ఉండటంతో ఆ పని చేయలేదన్న పోలీస్ శాఖను తప్పుబట్టింది. సదుద్దేశం ఉంటే తమకు ఆ విషయం చెప్పేవారని లేదా మరో IG స్థాయి అధికారితో ఆ పని చేయించేవారంది.