News March 18, 2024
రాష్ట్రంలో 4వ ఫేజ్లో ఎన్నికలు.. సీఈఓ రియాక్షన్ ఇదే..
TS: రాష్ట్రంలో 2019లో లోక్సభ ఎన్నికలు మొదటి ఫేజ్లోనే నిర్వహించగా.. ఈ సారి 4వ ఫేజ్కు మార్చడంపై రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్ స్పందించారు. ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘమే దీనిపై సమీక్షించి, నిర్ణయం తీసుకుందని తెలిపారు. పరిస్థితులను బట్టి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో వారే డిసైడ్ చేశారని పేర్కొన్నారు.
Similar News
News January 8, 2025
గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ నిర్మాతలకు షాక్
AP: గేమ్ ఛేంజర్, <<15068245>>డాకు మహారాజ్<<>> సినిమాల టికెట్ రేట్ల పెంపును 10 రోజులకు పరిమితం చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. 14 రోజుల వరకు <<15065900>>టికెట్ రేట్ల పెంపునకు<<>> ప్రభుత్వం అనుమతినివ్వగా, దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
News January 8, 2025
భక్తులు మాస్కులు ధరించాలి: TTD ఛైర్మన్
AP: జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేసినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. 10న ఉ.4:30కు ప్రొటోకాల్, వైకుంఠ ఏకాదశి రోజు ఉ.8గంటలకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ‘అన్ని ప్రత్యేక దర్శనాలను 10రోజులు రద్దు చేశాం. టికెట్లు లేకుండా తిరుమల వచ్చి ఇబ్బందులు పడొద్దు. 3K CC కెమెరాలతో నిఘా ఉంచాం. hMPV అలజడి నేపథ్యంలో భక్తులు మాస్క్ లాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలి’ అని ఛైర్మన్ కోరారు.
News January 8, 2025
BIG BREAKING: ఇంటర్ పరీక్షల్లో సమూల మార్పులు
AP: ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. బోర్డు కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుందని చెప్పారు. ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 నుంచి ఇంటర్లో సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్ ప్రవేశపెడతామని తెలిపారు.