News March 19, 2024

రాష్ట్రంలో ఎన్నికలు.. ఈసీ కీలక ప్రకటన

image

TG: ఎన్నికల రోడ్‌షోలకు సెలవు రోజుల్లోనే అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఇతర సమయాల్లో నిషేధం లేకున్నా, ప్రజలకు ఇబ్బంది లేకుండా అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఆస్పత్రులు, ట్రామాకేర్, బ్లడ్‌బ్యాంకులున్న ప్రాంతాల్లో రోడ్‌షోలు చేపట్టవద్దన్నారు. 85 ఏళ్లు పైబడిన, దివ్యాంగ ఓటర్లు 7.2 లక్షల మందికి నామినేషన్ల ఉపసంహరణ పూర్తైన 4 రోజుల తర్వాత హోం ఓటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు.

Similar News

News November 18, 2025

హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్.. గ్రౌండ్‌లోకి సీఎం రేవంత్!

image

ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ త్వరలోనే హైదరాబాద్‌కు రానున్నారు. “GOAT India Tour 2025”లో భాగంగా డిసెంబర్‌లో స్నేహపూర్వక మ్యాచ్ జరిగే అవకాశం ఉందని TPCC చీఫ్ మహేశ్ సంకేతాలిచ్చారు. ఆ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనవచ్చన్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహం పెంచుతున్నాయి. తెలంగాణను క్రీడా హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అథ్లెట్లకు పూర్తిస్థాయి మద్దతు అందిస్తున్నామని మహేశ్ తెలిపారు.

ఆవు తొలిచూలు, బర్రె మలిచూలు

image

ఆవు మొదటిసారి(తొలిచూలు) ఈనేటప్పుడు సాధారణంగా ఎక్కువ పాలు ఇవ్వకపోవచ్చు లేదా దూడ బలంగా ఉండకపోవచ్చు. అంటే, ఏదైనా ఒక పని తొలి ప్రయత్నంలో ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అదే బర్రె రెండోసారి(మలిచూలు) లేదా ఆ తర్వాత ఈనేటప్పుడు దూడ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు తొలి ప్రయత్నం సరిగా లేకున్నా.. మలి ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఈ సామెత అర్థం.