News May 11, 2024

ELECTIONS: చివరి బంతికి సిక్స్ కొట్టాలని

image

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నేతలంతా చివరి ప్రసంగాల్లో రెట్టింపు ఉత్సాహంతో కనిపించారు. సోషల్ మీడియా వేదికగా ఆయా పొలిటికల్ పార్టీలు చివరి బంతికి సిక్స్ కొట్టాలనేంత కసిగా ట్వీట్లు చేశాయి. తమ ప్రత్యర్థుల లోటుపాట్లను తూర్పారబడుతూనే.. ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించాయి. చివరి ప్రచార పోస్టులతో సోషల్ మీడియా నిండిపోయింది. AP, TGలో మే 13న పోలింగ్ ఉంది.
<<-se>>#Elections2024<<>>

Similar News

News November 19, 2025

రిస్క్‌లో 350 కోట్లమంది వాట్సాప్ కాంటాక్ట్స్?

image

డేటా లీకేజీతో వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీ ప్రమాదంలో పడనున్నట్లు వియన్నా యూనివర్సిటీ హెచ్చరించింది. ఆ యూనివర్సిటీ రీసెర్చర్స్ వాట్సాప్‌లో భారీ భద్రతా లోపాన్ని గుర్తించారు. వరల్డ్ వైడ్‌గా ఉన్న 350 కోట్లమంది యూజర్ల కాంటాక్ట్స్ లీక్ అయ్యే ప్రమాదం ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. హ్యాకర్లు లేదా వేరే వ్యక్తులు ఈ కాంటాక్ట్ నంబర్లను చోరీ చేసే అవకాశమున్నట్లు తెలిపారు.

News November 19, 2025

ICC అండర్-19 మెన్స్ WC షెడ్యూల్ విడుదల

image

ఐసీసీ మెన్స్ అండర్-19 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారైంది. జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో 2026 జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు టోర్నీ జరగనుంది. 16 టీమ్స్‌ నాలుగు గ్రూపులుగా విడిపోగా గ్రూపుAలో భారత్, USA, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇక్కడ టాప్ ప్రదర్శన చేసిన జట్లు సూపర్ సిక్స్‌కు, ఈ ప్రదర్శన ఆధారంగా సెమీస్ అనంతరం ఫైనల్ జట్లు ఖరారు కానున్నాయి. పూర్తి షెడ్యూల్ కోసం పైన స్లైడ్ చేయండి.

News November 19, 2025

నేషనల్-ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

image

* గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌కి 11 రోజుల NIA కస్టడీ విధించిన పటియాలా కోర్టు
* భారత్ నుంచి షేక్ హసీనాను రప్పించేందుకు ఇంటర్‌పోల్‌ సహాయం తీసుకోవాలని యోచిస్తున్న బంగ్లాదేశ్
* టెర్రర్ మాడ్యూల్ కేసులో అల్ ఫలాహ్ వర్సిటీకి సంబంధించి వెలుగులోకి కీలక విషయాలు.. ఛైర్మన్ జావద్ సిద్దిఖీ కుటుంబీల కంపెనీలకు రూ.415 కోట్లు అక్రమంగా తరలించినట్లు గుర్తించిన ED