News November 12, 2024
Elections: ఈ ప్రాంతాల్లో రేపే ఓట్ల పండుగ
దేశంలో మరోసారి ఓట్ల పండుగకు సమయమొచ్చింది. ఝార్ఖండ్ అసెంబ్లీ మొదటి విడత ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. మొత్తం 43 స్థానాల్లో (20 ST, 6 SC) 685 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే వయనాడ్ లోక్‌సభ స్థానానికి కూడా రేపే ఉపఎన్నిక జరగనుంది. ఇక దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 47 అసెంబ్లీ స్థానాలకు ఈసీ బైపోల్స్ నిర్వహించనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
Similar News
News December 26, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో రేపు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
News December 26, 2024
పాక్‌పై యుద్ధానికి 15వేలమంది తాలిబన్లు
తూర్పు అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని అక్కడి తాలిబన్ సర్కారు తేల్చిచెప్పింది. కాబూల్ నుంచి పాక్ సరిహద్దుల్లోకి 15వేలమంది తాలిబన్ ఫైటర్లను తరలిస్తున్నట్లు ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాక్‌లో వారి అనుబంధ సంస్థ టీటీపీ ఉగ్రదాడులు పెంచింది. ఈ నేపథ్యంలోనే పాక్, అఫ్గాన్ మధ్య సంబంధాలు క్షీణించాయి.
News December 26, 2024
రూ.1,700 కోట్లు దాటిన ‘పుష్ప 2’ కలెక్షన్లు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.1,705 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 21 రోజుల్లోనే రూ.1705 కోట్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. హిందీలోనే ఈ చిత్రం 700 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఒక్క ముంబైలోనే రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు చేసింది.