News March 16, 2024
స్థోమతకు మించి ఎలక్టోరల్ బాండ్లు కొనేశారు! – 1/2

కార్పొరేట్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో రాజకీయ పార్టీలకు భారీగా నిధులు అందించాయి. అయితే ఓ 25 సంస్థలు తమ స్థోమతకు మించి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. వీటి విలువ రూ.5 కోట్లలోపే అయినా ఏకంగా రూ.250కోట్లు విలువైన బాండ్స్ కొన్నాయి. వీటిలో తొమ్మిది కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ వచ్చాక (2018) ఏర్పడటం గమనార్హం. ఈ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలూ ఉన్నాయి.
Similar News
News September 4, 2025
వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్దాం: మోదీ

దేశ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారుతాయని PM మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. స్వదేశీ వస్తు వినియోగం, మేడిన్ ఇండియాను విద్యార్థి దశలోనే నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. ‘వోకల్ ఫర్ లోకల్ నినాదం మరింత ముందుకు తీసుకెళ్లాలి. దేశీయ ఉత్పత్తులు వాడుతున్నామని అందరూ గర్వపడాలి. గాంధీజీ నినాదం కూడా స్వదేశీ.. దాన్ని అందరం పాటించాలి. స్వదేశీ డే, స్వదేశీ వీక్‌ను పండుగగా నిర్వహించుకోవాలి’ అని పిలుపునిచ్చారు.
News September 4, 2025
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ కన్నుమూత

ప్రపంచ ప్రఖ్యాత, ఇటలీ లెజెండరీ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ(91) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు ఫ్యాషన్ హౌస్ కంపెనీ తెలిపింది. కింగ్ జార్జియోగా పేరొందిన అర్మానీ మోడర్న్ ఇటాలియన్ స్టైల్‌తో పేరొందారు. ఆయన కంపెనీ ఏటా 2.3 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జిస్తోంది. అర్మానీ అంత్యక్రియలు ఈ నెల 6 లేదా 7న నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అర్మానీ బ్రాండ్ వస్త్ర ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది.
News September 4, 2025
జాగృతిలో చీలికలు.. BRS కోసమే పనిచేస్తామంటున్న నేతలు

TG: బీఆర్ఎస్ను కవిత వీడటంతో దాని అనుబంధ సంస్థగా ఉన్న జాగృతిలో చీలికలు బయటపడుతున్నాయి. కవిత తమను నడిరోడ్డుపై పడేసిందని జాగృతి నేత రాజీవ్ సాగర్ ఆరోపించారు. బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి తమదేనని, కేసీఆర్ చెప్పిందే చేస్తామని చెప్పారు. తెలంగాణ జాగృతి బోర్డు పెట్టుకునే హక్కు తమకు ఉందన్నారు. దీనిపై జాగృతి ఫౌండర్ కవిత స్పందించాల్సి ఉంది.