News March 16, 2024
స్థోమతకు మించి ఎలక్టోరల్ బాండ్లు కొనేశారు! – 2/2
లాభాల్లో గరిష్ఠంగా 7.5శాతాన్నే డొనేట్ చేయాలనే నిబంధన పోవడంతో టర్నోవర్తో సంబంధం లేకుండా కంపెనీలు విరాళాలు ఇస్తున్నాయి. 2023లో టీషార్క్స్ ఇన్ఫ్రా, టీషార్క్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ చెరో రూ.లక్షతో ఏర్పడిన కొన్ని నెలలకే రూ.7.5కోట్లు విలువైన బాండ్స్ కొన్నాయి. అపర్నా ఫార్మ్స్ రూ.5లక్షలతో ఏర్పడగా రూ.30కోట్లు విలువైన బాండ్స్ కొంది. ఇలా సంస్థలు స్థోమతకు మించి బాండ్స్ కొనడం చర్చనీయాంశమైంది.
Similar News
News November 21, 2024
కొడుకు కాపురంపై స్పందించిన అమితాబ్
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ వైవాహిక జీవితం సరిగా లేదంటూ వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాటిపై అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో పరోక్షంగా స్పందించారు. ‘ఊహాగానాలెప్పుడూ ఊహాగానాలే. అవాస్తవాలే. వాటికి ఎటువంటి ఆధారాలు ఉండవు. ధ్రువీకరణ కాని సమాచారాన్ని ప్రశ్నార్థకం పెట్టి రాసేస్తుంటారు. అది ఎవరి గురించైతే రాశారో వారి జీవితంపై ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో పట్టించుకోరు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
News November 21, 2024
కాల్పులు.. 38 మంది మృతి
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో దారుణం జరిగింది. ముష్కరులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 38 మంది మరణించారు. 29 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. పరాచినార్ నుంచి పెషావర్కు వెళ్తున్న రెండు వ్యాన్లపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు.
News November 21, 2024
ఘోరం: కుటుంబమంతా ఆత్మహత్య
AP: అనంతపురం జిల్లా నార్పలలో ఒకే కుటుంబంలోని ముగ్గురు <<14669649>>ఉరేసుకొని<<>> ఆత్మహత్యకు పాల్పడ్డారు. నార్పలకు చెందిన కృష్ణ కిషోర్ (45) మెడికల్ స్టోర్ నిర్వహించేవారు. ఏ కష్టమొచ్చిందేమో కానీ భార్య శిరీష (35), 6 నెలల కుమారుడితో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.