News July 21, 2024

ఫ్లాట్‌లో కరెంట్ షాక్.. ముగ్గురు మృతి

image

TG: హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో విషాదం జరిగింది. ఓ ఫ్లాట్‌లో కరెంట్ షాక్‌తో ముగ్గురు మరణించారు. బాత్ రూమ్‌లో ముగ్గురి మృతదేహాలను కాలనీవాసులు గుర్తించారు. జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు వెంకటేశ్ (55), మాధవి (50), హరి (30). ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 3, 2026

ధనుర్మాసం: పంతొమ్మిదో రోజు కీర్తన

image

హంస తూలికా తల్పంపై పవళించిన స్వామిని మాట్లాడమని వేడుకుంటున్నారు. కృష్ణుడిని క్షణ కాలం కూడా విడవలేని నీళాదేవిని ఉద్దేశించి ‘తల్లీ! నీ నిరంతర సాన్నిధ్యం నీ స్వభావానికి తగినదే! కానీ, మమ్మల్ని కూడా కరుణించి స్వామి సేవలో పాల్గొనే అవకాశమివ్వు’ అని అడుగుతున్నారు. జగన్మాత అయిన నీళాదేవి అనుమతి వస్తేనే తమ ధనుర్మాస వ్రతం సఫలమై, భగవత్ కైంకర్యం సిద్ధిస్తుందని గోదాదేవి ఆర్తితో విన్నవిస్తున్నారు. <<-se>>#DHANURMASAM<<>>

News January 3, 2026

వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతోంది: రాజ్‌నాథ్

image

దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఉన్నత విద్యావంతులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పారు. <<18265346>>ఢిల్లీ పేలుడు<<>> ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జ్ఞానంతోపాటు విలువలు, వ్యక్తిత్వం కూడా అవసరమని చెప్పారు. విద్య ఉద్దేశం వృత్తిపరమైన విజయం మాత్రమే కాదని, నైతికత, నీతి, కార్యక్టర్‌ను అభివృద్ధి చేసుకోవడమని చెప్పారు.

News January 3, 2026

వివక్ష ఎదుర్కొన్నా.. మాటల దాడి చేశారు: ఖవాజా

image

అంతర్జాతీయ క్రికెట్‌కు <<18737315>>రిటైర్మెంట్<<>> ప్రకటించిన ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆస్ట్రేలియాలో వివక్ష ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. నేనూ ఎదుర్కొన్నా. ఇస్లామోఫోబియా ప్రబలంగానే ఉంది’ అని చెప్పారు. వెన్నునొప్పి వల్ల ఇటీవల పెర్త్ టెస్టుకు దూరమైతే మాజీ ఆటగాళ్లు, మీడియా తనపై మాటల దాడి చేసినట్లు వాపోయారు. తన క్రెడిబిలిటీనే ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.