News July 5, 2024
QR కోడ్‌తో విద్యుత్ బిల్లు చెల్లింపులు

TG: విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో కొత్తగా QR కోడ్ విధానాన్ని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తీసుకొచ్చింది. రీడింగ్ తీశాక వచ్చే బిల్లు కిందే QR కోడ్ ఉంటుంది. వినియోగదారులు ఫోన్లో దీనిని స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అమల్లోకి రాగా.. త్వరలో అన్ని జిల్లాల్లో QR కోడ్ బిల్లులు రానున్నాయి.
Similar News
News December 17, 2025
ఫ్లాట్‌గా మొదలై లాభాల వైపు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా మొదలై లాభాల వైపు పయనిస్తున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 162 పాయింట్లు లాభపడి 84,843 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు వృద్ధి చెంది 25,913 వద్ద కొనసాగుతోంది. యాక్సిక్ బ్యాంక్, ఎస్బీఐ, ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, మారుతి, టాటా స్టీల్, ఎయిర్టెల్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
News December 17, 2025
విమర్శలను ఎదుర్కోవడం నేర్చుకోండి

తమపై విమర్శలు వస్తే అమ్మాయిలు కుంగిపోతూ ఉంటారు. అయితే వాటిని సానుకూలంగా చూడటం అలవాటు చేసుకోవాలంటున్నారు సైకాలజిస్టులు. అప్పుడే విమర్శల నుంచి పాఠాలు నేర్చుకొని మరింత ఎదిగే అవకాశం లభిస్తుందంటున్నారు. ‘విమర్శలను మనసుకు తీసుకుంటే భావోద్వేగాలు తీవ్రమై, మానసిక క్షోభ అనుభవించాల్సి ఉంటుంది. విమర్శలకు, భావోద్వేగాలకు ముడిపెట్టకూడదు. సానుకూల విమర్శలను స్వీకరించి వృద్ధికి బాటగా మలచుకోవాలి’ అని చెబుతున్నారు.
News December 17, 2025
ఉత్కంఠ.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు నేడే!

TG: ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ నేడు తీర్పు ప్రకటించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల అడ్వకేట్లకు ఆయన నోటీసులు పంపారు. 3.30PMకు స్పీకర్ ఆఫీసుకు BRS, ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్లు రానున్నారు. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డిపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.


