News October 27, 2025

విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు: గొట్టిపాటి

image

AP: మొంథా తుఫాను నేపథ్యంలో 27, 28, 29 తేదీల్లో విద్యుత్ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉంటూ, విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తిన వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. ఎక్కడైనా పవర్ సప్లైలో అంతరాయం కలిగితే 1912 నంబరును సంప్రదించాలని ప్రజలకు సూచించారు. కిందపడిన విద్యుత్ స్తంభాలు, వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి చెప్పారు.

Similar News

News October 27, 2025

సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ గ‌డువు పొడిగింపు

image

ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు CBSE ప్రత్యేక స్కాలర్‌షిప్‌ని అందిస్తోంది. 10th పాసై ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 11th చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌‌కు అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. పదోతరగతిలో 70%మార్కులు వచ్చి ఉండాలి. తాజాగా దరఖాస్తు గడువు తేదీని నవంబర్ 20 వరకు పొడిగించారు.
వెబ్‌సైట్‌: <>https://www.cbse.gov.in<<>>

News October 27, 2025

యాషెస్ తొలి టెస్టుకు కమిన్స్ దూరం

image

ఇంగ్లండ్‌తో జరిగే ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ తొలి టెస్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరమయ్యారు. నవంబర్ 21 నుంచి జరిగే మ్యాచ్‌కు వెన్నునొప్పి కారణంగా ఆయన అందుబాటులో ఉండబోరని ఆసీస్ బోర్డు తెలిపింది. దీంతో సీనియర్ బ్యాటర్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కమిన్స్ ప్లేస్‌లో బోలాండ్ జట్టులోకి రానున్నట్లు సమాచారం. కాగా కమిన్స్ ఇటీవల భారత్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరమైన విషయం తెలిసిందే.

News October 27, 2025

52 ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతో ఎంపిక

image

ఎయిమ్స్ గోరఖ్‌పూర్ 52 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు NMC/MCI/SMCలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ నెల 29న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ఇంటర్వ్యూ/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, STలకు రూ.250, PWBDలకు ఫీజునుంచి మినహాయింపు ఉంది. వయసు 45ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://aiimsgorakhpur.edu.in/