News December 27, 2024
YS జగన్ వల్లే విద్యుత్ ఛార్జీల పెంపు: అచ్చెన్నాయుడు

AP: వైసీపీ పాలనలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు ఛార్జీల పెరుగుదలకు జగనే కారణమని ఆరోపించారు. యూనిట్ విద్యుత్ రూ.5కే వస్తున్నా జగన్ రూ.8కి కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. ఆయన చేసిన పాపాలు నేడు శాపాలుగా మారాయని మండిపడ్డారు. ప్రజలపై భారం మోపి ఇప్పుడు ధర్నాలు, ర్యాలీలు చేయడం సిగ్గుచేటన్నారు.
Similar News
News December 1, 2025
హనుమకొండ: నర్సింగ్ విద్యార్థినిపై కెమికల్ దాడి

హనుమకొండలోని ఓ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న ఓ యువతి మీద కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై గుర్తుతెలియని వ్యక్తులు కెమికల్ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఎంజీఎం ఆస్పత్రిలో చేర్చగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలిది జనగాం జిల్లా జఫర్‌ఘడ్ మండలం అని తెలిసింది. కాజీపేట ఏసీపీ, పోలీసులు ఎంజీఎం ఆస్పత్రిలో బాధితురాలితో మాట్లాడి విచారణ చేస్తున్నారు.
News December 1, 2025
దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్‌లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.
News December 1, 2025
ఇంట్లో గణపతి విగ్రహం ఉండవచ్చా?

గృహంలో వినాయకుడి ప్రతిమను నిరభ్యంతరంగా ప్రతిష్ఠించవచ్చని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇష్ట దైవాలు, కుల దేవతల విగ్రహాలతో పాటు గణపతి విగ్రహాన్ని కూడా పూజా మందిరంలో పెట్టవచ్చు అని చెబుతున్నారు. అయితే, నవ గ్రహాలు, ఉగ్ర దేవతా మూర్తుల విగ్రహాలు లేదా చిత్ర పటాలు పూజా గదిలో లేకుండా చూసుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. వాస్తు ప్రకారం.. గణపతి విగ్రహం ఉంటే ఎలాంటి దోషం ఉండదంటున్నారు.<<-se>>#Vasthu<<>>


