News October 15, 2025
విద్యుత్ సంఘాల సమ్మె వాయిదా

AP: విజయవాడలో విద్యుత్ సంఘాల నేతలతో CS విజయానంద్, విద్యుత్ CMDల చర్చలు ముగిశాయి. సమస్యలకు సంబంధించి కొన్ని అంశాలపై చర్చలు కొలిక్కొచ్చాయని JAC నేత కృష్ణయ్య పేర్కొన్నారు. ‘కొన్ని అంశాలు పెండింగ్లోనే ఉన్నాయి. ప్రధాని మోదీ కర్నూలు పర్యటన నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. ఈ నెల 17న మ.3 గం.కు మళ్లీ చర్చలకు హాజరవుతాం. అప్పుడు సమ్మెపై నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు.
Similar News
News October 15, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో NOV 6 ఉ.7 గంటల నుంచి 11 సా. 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇది TV, రేడియో, పత్రికలు, SM, డిజిటల్ ప్లాట్‌ఫామ్ వంటి అన్ని సమాచార మాధ్యమాలకు వర్తిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారికి చట్టప్రకారం రెండేళ్ల జైలు/జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందన్నారు. కాగా NOV 11న పోలింగ్ జరగనుంది.
News October 15, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా లాభపడి 82,380 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 116 పాయింట్లు వృద్ధి చెంది 25,262 వద్ద కొనసాగుతోంది. ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, L&T, ఎటర్నల్, బెల్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.
News October 15, 2025
లెగ్గింగ్స్ కొంటున్నారా?

అందుబాటు ధరల్లో, డిజైన్లలో వచ్చే లెగ్గింగ్స్ రోజువారీ ఫ్యాషన్‌తో భాగమైపోయాయి. వీటిని ఎంచుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎత్తు తక్కువగా ఉన్నవారికి లో వెయిస్ట్ లెగ్గింగ్స్, పొడుగ్గా ఉన్న వారికి హై రైజ్ లెగ్గింగ్స్ నప్పుతాయి. పొట్ట ఉంటే బాడీ షేపర్ లెగ్గింగ్స్ ఎంచుకోవాలి. సీమ్ లెస్ లెగ్గింగ్స్ నీటుగా కనిపిస్తాయి. పూలు, ప్రింట్లున్నవి బావుంటాయి. లైక్రా, నైలాన్, రేయాన్ రకాలు మన్నికగా ఉంటాయి.