News February 25, 2025
ఏనుగుల దాడి.. మృతులకు రూ.10 లక్షల పరిహారం

AP: అన్నమయ్య జిల్లాలో భక్తులపై <<15571904>>ఏనుగుల దాడి<<>> ఘటనలో మృతుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అనౌన్స్ చేశారు. క్షతగాత్రుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Similar News
News February 25, 2025
మద్దతిచ్చినందుకు థాంక్యూ ట్రంప్: వివేక్ రామస్వామి

ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికన్ హిందూ, రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి థాంక్స్ చెప్పారు. ఓహైయో గవర్నర్ అభ్యర్థిగా ఎండార్స్ చేయడం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. తామంతా ఆయనకు అండగా ఉంటామని, ఓహైయోను మళ్లీ గొప్పగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘వివేక్ గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన నాకు బాగా తెలుసు. ఆయనెంతో స్పెషల్, యంగ్, స్మార్ట్’ అంటూ ట్రంప్ ట్వీట్ చేయడం తెలిసిందే.
News February 25, 2025
చంద్రబాబు ఇంటిపై దాడి కేసు నిందితులకు ముందస్తు బెయిల్

AP: YCP హయాంలో చంద్రబాబు ఇల్లు, TDP ఆఫీసుపై జరిగిన దాడి కేసుల్లో నిందితులకు సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీంతో దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా 20 మందికి ఊరట దక్కింది. అయితే విచారణకు సహకరించాలని, దేశం వదిలి వెళ్లొద్దని ఆదేశించింది. విచారణను 3 ఏళ్లు తాత్సారం చేశారని వ్యాఖ్యానించింది. నిందితులకు తాము తప్పు చేశామని తెలుసని, అధికారం పోయాక కోర్టుకు వచ్చారని ప్రభుత్వం వాదనలు వినిపించింది.
News February 25, 2025
జోకర్‌గా జగన్.. జనసేన ఎమ్మెల్యే సెటైర్

AP: ప్రజా సమస్యల గురించి ఆలోచించకుండా జగన్ ఓ జోకర్‌గా మిగిలారని జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తోన్న ఆయన.. ప్రజా తీర్పును గౌరవించలేదని దుయ్యబట్టారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందని చెప్పారు.