News May 14, 2024

టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవికి అర్హతలివే..

image

టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వారి వయసు 60ఏళ్లలోపు ఉండాలని BCCI తెలిపింది. కనీసం 30టెస్టులు/50వన్డేలు ఆడి ఉండాలని, లేదా టెస్టులు ఆడుతున్న జట్టుకు కనీసం రెండేళ్లు హెడ్ కోచ్‌గా వ్యవహరించాలని పేర్కొంది. లేదంటే IPL టీమ్, ఇంటర్నేషనల్ లీగ్ జట్టు, ఫస్ట్ క్లాస్ టీమ్, నేషనల్ ఏ జట్టులో ఏదైనా ఒకదానికి కనీసం మూడేళ్లు హెడ్ కోచ్‌గా పనిచేసి ఉండాలంది. అనుభవం ఆధారంగా వేతనం ఇవ్వనున్నట్లు చెప్పింది.

Similar News

News February 13, 2026

ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

image

AP: ఇంటర్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. https://bie.ap.gov.in/ ద్వారా లేదా మన మిత్ర వాట్సాప్(9552300009) సేవల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు వీటిని డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందజేయాలని, ఫీజు బకాయిల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని స్పష్టం చేశారు. కాగా FEB 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు జరగనున్నాయి.

News February 13, 2026

‘ఒక్క ఓటు’తో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం!

image

TG: కల్వకుర్తి మున్సిపాలిటీలోని పదో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్ ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థికి 259, BRS అభ్యర్థి తాహెర్‌కు 258 ఓట్లు పోలయ్యాయి. మొదటిసారి ఓట్ల లెక్కింపులో 2 ఓట్లు మెజార్టీ రావడంతో రీకౌంటింగ్ చేయగా ఒక్క ఓటుతో కాంగ్రెస్ గెలిచింది. పరకాల మున్సిపాలిటీలోని 17వ వార్డులోనూ కాంగ్రెస్ అభ్యర్థి సుభద్ర ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు.

News February 13, 2026

రోజుకు ₹200 మీల్స్‌పై పన్ను మినహాయింపు!

image

ఉద్యోగులకు మీల్స్‌పై ఇస్తున్న పన్ను మినహాయింపును పెంచాలని ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్‌ 2026లో ప్రభుత్వం ప్రతిపాదించింది. గతంలో ఇది రోజుకు ₹50గా ఉండగా.. దాన్ని ₹200కు పెంచాలని నిర్ణయించారు. ఇది ఫైనలైజ్ అయితే ఉద్యోగులకు ఏటా మీల్స్ ఖర్చుల కింద ₹1,05,600పై పన్ను మినహాయింపు పొందే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రయోజనం పాత పన్ను విధానంలో ITR సమర్పించేవారికి వర్తిస్తుంది. కొత్త విధానంపై క్లారిటీ రావాల్సి ఉంది.