News March 18, 2024
ఎల్లారెడ్డిపేట: పుట్టెడు దుఃఖంలో పదవ తరగతి పరీక్ష

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పుట్టి శ్రవణ్ అనే విద్యార్థి పుట్టెడు దుఃఖంలో పదవ తరగతి పరీక్ష రాశాడు. తండ్రి రవి అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది. తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించిన శ్రావణ్ 10వ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాశాడు.
Similar News
News March 22, 2026
కరీంనగర్: ‘హృదయవిదారక చిత్రం’

శంకరపట్నం మండలం అంబేడ్కర్ చౌరస్తా వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన మూడేళ్ల చిన్నారి నిత్య దహన సంస్కారాలు ఆదివారం నిర్వహించారు. తల్లిదండ్రులు తమ చేతుల మీదుగా పాప మృతదేహాన్ని స్మశానవాటికకు తీసుకెళ్లడం అందరినీ కలచివేసింది. బంధువులు, గ్రామస్తుల సమక్షంలో అంత్యక్రియలు జరగగా, తల్లిదండ్రుల ఆవేదన హృదయ విదారకంగా మారింది. ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
News March 21, 2026
KNR: లగ్జరీ బస్సులో వాటర్ బాటిల్ బంద్

ఆర్టీసీ సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి, డిలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారికి అందిస్తున్న జీవ (500 ML) వాటర్ బాటిళ్ల సరఫరా బంద్ చేశారు. కానీ వాటర్ బాటిల్‌కు టికెట్ ఛార్జీలో రూ.10 ఛార్జి వడ్డించడంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం దృష్ట్యా ఉన్నతాధికారులు స్పదించి కరీంనగర్ రీజియన్ బస్సుల్లో ప్రయాణికులకు వాటర్ బాటిల్ సరఫరా చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.