News July 23, 2024
ఎల్లుండి క్యాబినెట్ భేటీ

AP: ఈ నెల 25న మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ అత్యవసర క్యాబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అటు రేపు సాయంత్రం 4.30 గంటలకు మంత్రులు, కార్యదర్శులు, HODలతో చంద్రబాబు భేటీ కానున్నారు. శాఖల వారీగా ప్రభుత్వానికి ప్రాధాన్యత ఉన్న అంశాల గురించి వారికి ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News December 7, 2025
స్మృతి మంధాన పెళ్లి రద్దు.. ఏం జరిగింది?

తన ప్రియుడు పలాశ్ ముచ్చల్తో నిశ్చితార్థం జరిగినట్లు స్మృతి మంధాన నవంబర్ 20న ప్రకటించారు. అదే నెల 23న పెళ్లి జరగాల్సి ఉండగా, స్మృతి తండ్రికి గుండెపోటు రావడంతో చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోయింది. ఆమె ప్రియుడు కూడా అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత అతడు వేరే అమ్మాయితో చాటింగ్ చేసినట్లు ఉన్న స్క్రీన్ షాట్లు వైరలయ్యాయి. పెళ్లి రద్దయినట్లు స్మృతి తాజాగా <<18495850>>ప్రకటించారు<<>>. అయితే కారణాన్ని వెల్లడించలేదు.
News December 7, 2025
వీటిని తింటే కళ్లద్దాల అవసరమే రాదు

ప్రస్తుత రోజుల్లో చిన్నారులను సైతం కంటి చూపు సమస్యలు వేధిస్తున్నాయి. పోషకాహార లోపమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. రోజూ క్యారెట్, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, చిలకడదుంపలు తినిపిస్తే Vitamin A సమృద్ధిగా లభిస్తుంది. చేపలు, వాల్నట్స్, అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వల్ల కళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది. క్యాప్సికం, బ్రోకలీ వంటి ఆహారాలు కూడా కంటి నరాలకు మేలు చేస్తాయి.
News December 7, 2025
50 ఏళ్ల నాటికి సరిపోయేలా ‘ఒంటిమిట్ట’ అభివృద్ధి

AP: పురాతన ఒంటిమిట్ట కోదండ రామాలయం అభివృద్ధిపై TTD ప్రత్యేక మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తోంది. మరో 50 ఏళ్లలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది. వసతి, రవాణా, కల్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్ర వనాలు, మ్యూజియమ్, ఉద్యానవనాలు, డిజిటల్ స్క్రీన్స్, కళామందిరం, 108Ft జాంబవంతుడి విగ్రహం, మాడ వీధుల అభివృద్ధి, CC కెమెరాలు వంటి వాటిపై EO సింఘాల్ అధికారులకు సూచించారు.


