News October 27, 2024

ఎల్లుండి ఉ.10 గంటల నుంచి..

image

AP: రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 29 ఉ.10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్‌తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలుత డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు వారి ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వనున్నారు.

Similar News

News October 28, 2024

కుమారుడి ఒడిలో నిద్రించిన హార్దిక్ పాండ్య

image

టీమ్ ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య తన కుమారుడికి సంబంధించిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అగస్త్య ఆడుకుంటుండగా హార్దిక్ అతడి ఒడిలో నిద్రించారు. ఇది చూసిన ఫ్యాన్స్ క్యూటెస్ట్ ఫొటో అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా హార్దిక్, నటాషా విడాకుల అనంతరం అగస్త్య తన పెద్దమ్మ పాంఖురి దగ్గరే ఉంటున్నారు. ఆమెనే ఈ చిన్నారి ఆలనాపాలనా చూస్తున్నారు.

News October 28, 2024

ముగ్గురు హెజ్బొల్లా నేతల్ని అంతం చేశాం: ఇజ్రాయెల్

image

లెబనాన్‌లోని బింట్ జెబీల్ ప్రాంతంలో హెజ్బొల్లా సంస్థకు చెందిన ముగ్గురు కీలక నేతల్ని వైమానిక దాడుల్లో హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ట్విటర్‌లో ప్రకటించింది. వారిలో బింట్ జెబీల్ కమాండర్ అహ్మద్ జాఫర్, అతడి తర్వాత కమాండర్ కావాల్సిన వ్యక్తి, ఆర్టిలరీ హెడ్‌లు ఉన్నారని స్పష్టం చేసింది. తమ దేశంపై జరిగిన అనేక దాడుల్లో వీరి ప్రమేయం ఉందని తెలిపింది.

News October 28, 2024

సుఖ నిద్ర కావాలా? ఇలా చేయండి

image

ప్రస్తుతం పని ఒత్తిడితో కొందరు నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. కానీ కొన్ని పనులు చేస్తే గాఢ నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయాన్నే వ్యాయామం చేస్తే శారీరక శ్రమ ఏర్పడి బాగా నిద్ర పడుతుంది. సాయంత్రం గోరు వెచ్చటి నీటితో స్నానం చేసి, గ్లాసు పాలు తాగాలి. అలాగే రాత్రి త్వరగా భోజనం చేయాలి. ఇలా చేస్తే తిన్నవి త్వరగా జీర్ణమై నిద్ర పడుతుంది. రాత్రి కాఫీ, టీ, వైన్, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు.