News June 18, 2024
ఎల్లుండి భారత హెడ్ కోచ్ ప్రకటన?

టీమ్ ఇండియా కొత్త హెడ్ కోచ్ పేరును BCCI ఎల్లుండి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ KKR మెంటార్ గౌతమ్ గంభీర్‌ను BCCI ఇంటర్వ్యూ చేసింది. ఆయనతోపాటు WV రామన్‌నూ ప్రశ్నించింది. రేపు ఓ విదేశీయుడితోపాటు గంభీర్‌ను మరోసారి ఇంటర్వ్యూ చేయనున్నట్లు సమాచారం. అనంతరం షార్ట్ లిస్ట్ చేసి కోచ్ పేరును ప్రకటించనుంది. వీరు ముగ్గురూ పోటీలో ఉన్నా గంభీర్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News March 28, 2026
కామరాజర్ పోర్టులో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ

చెన్నైలోని కామరాజర్ పోర్టు 14 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఏదైనా డిగ్రీ, బీకామ్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT), DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.25,250-రూ.50,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://kpl.cbtexam.in
News March 28, 2026
16ఏళ్లలోపు పిల్లలకు ఇండోనేషియాలో SM బ్యాన్!

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు ఇండోనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి దేశంలో 16ఏళ్లలోపు పిల్లలు SM వాడకంపై నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూట్యూబ్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో 16ఏళ్లలోపు పిల్లలు అకౌంట్స్ ఓపెన్ చేయలేరు. ఆస్ట్రేలియా తర్వాత ఈ తరహా కఠిన చట్టాన్ని తెచ్చిన దేశంగా ఇండోనేషియా నిలిచింది.
News March 28, 2026
EPFO యాప్‌తో రూ.5 లక్షల వరకు విత్‌డ్రా!

ఉద్యోగులు UMANG యాప్‌తో పాటు EPFO యాప్ ద్వారా కూడా PF నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఉన్న రూ.లక్ష పరిమితిని రూ.5లక్షల(75%) వరకు పెంచారు. ఈ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన UPI PIN ఉపయోగించి సులభంగా పొందవచ్చు. పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, నామినీ అప్‌డేట్ వంటి సేవలు పొందవచ్చని, దీనివల్ల 8 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని EPFO వెల్లడించింది.


