News September 16, 2024
ఎల్లుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ

AP: పౌర్ణమి సందర్భంగా ఈ నెల 18వ తేదీన విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఉదయం 5.55 గంటలకు కామథేను ఆలయం నుంచి కుమ్మరిపాలెం, 4 స్థంభాలు, విద్యాధరపురం, సితారా, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, రథం సెంటర్ మీదుగా మహామండపం వద్ద ప్రదక్షిణ ముగుస్తుంది. ఇటీవల ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.
Similar News
News October 30, 2025
చైనా అంతరిక్ష యాత్రకు పాక్ ఆస్ట్రోనాట్!

చైనా, పాకిస్థాన్ దోస్తీ కొత్త పుంతలు తొక్కుతోంది. తమ టియాంగోంగ్ స్పేస్ స్టేషన్కు చేపట్టే స్వల్పకాలిక అంతరిక్ష యాత్రలో పాకిస్థానీ ఆస్ట్రోనాట్కు అవకాశం కల్పిస్తామని చైనా ప్రకటించింది. ఎంపికైన పాక్ వ్యోమగామికి తమ ఆస్ట్రోనాట్లతో పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్, మిషన్ టైమ్లైన్ను ఖరారు చేసే పనిలో చైనా, పాక్ స్పేస్ ఏజెన్సీలు ఉన్నాయని అక్కడి మీడియా వెల్లడించింది.
News October 30, 2025
సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్

సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ <<18087163>>సూర్యకాంత్<<>>ను నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత CJI గవాయ్ చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24న బాధ్యతలు స్వీకరించనున్నారు. 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతారు. హరియాణా నుంచి ఎన్నికైన తొలి సీజేఐగా సూర్యకాంత్ నిలవనున్నారు.
News October 30, 2025
దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి అజహరుద్దీన్: కిషన్ రెడ్డి

TG: అజహరుద్దీన్కు మంత్రి పదవిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి అజహరుద్దీన్. దేశానికి చెడ్డ పేరు తెచ్చారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారు’ అని వ్యాఖ్యానించారు. అటు జూబ్లీహిల్స్లో MIM ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ అభ్యర్థే జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.


