News October 26, 2024

ఎల్లుండి భూమి సమీపానికి భారీ గ్రహశకలం

image

ఈ నెల 28న ఓ భారీ గ్రహశకలం భూమి సమీపానికి రానున్నట్లు నాసా సైంటిస్టులు తెలిపారు. దీనికి ‘ఆస్టరాయిడ్ 2020 WG’ అనే పేరు పెట్టారు. 70 అంతస్తుల భవనమంత పరిమాణం ఉండే ఈ గ్రహ శకలం భూమికి 3.3 మిలియన్ కి.మీ దూరంలోకి రాబోతున్నట్లు తేల్చారు. ఇది సెకనుకు 9.43 కి.మీ వేగంతో భూమి వైపుగా దూసుకొస్తోందని తెలిపారు. దీని వల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Similar News

News October 26, 2024

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తాం: KTR

image

TG: కొడంగల్‌లోనే కాంగ్రెస్‌పై తిరుగుబాటు మొదలైందని కేటీఆర్ అన్నారు. కొండగల్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో BRSలో చేరారు. ధర్నాలు, రాస్తారోకోలతో రాష్ట్రం అట్టుడుకుతుంటే మంత్రులు విహారయాత్రల్లో ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. పదేళ్లు పరుగులు పెట్టిన రాష్ట్ర ఆదాయం తగ్గుతోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తామని చెప్పారు.

News October 26, 2024

సినిమా ఛాన్స్‌లు రాకపోయినా ప్రశ్నిస్తూనే ఉంటా: ప్రకాశ్ రాజ్

image

సమాజంలో జరిగే తప్పులను చూస్తూ ఊరుకోలేనని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. తాను సినిమా అవకాశాలు కోల్పోయినా ప్రశ్నించడం ఆపనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నా కుమారుడి (సిద్ధు) మరణంతో బాధలో కూరుకుపోయా. కానీ నాకు కుటుంబం ఉంది. వృత్తి ఉంది. నాకంటూ మనుషులున్నారు. జీవితం ఉంది. అందుకే తిరిగి నిలబడ్డా. నా టాలెంట్‌ చూసి ప్రజలు ఆదరించారు. వారి ప్రేమ వల్లే ఇంకా నటుడిగా కొనసాగుతున్నా’ అని ఆయన చెప్పుకొచ్చారు.

News October 26, 2024

RTCలో 7,545 ఉద్యోగాలు!

image

APSRTCలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. సంస్థలో ఖాళీల వివరాలను ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించింది. 18 కేటగిరీల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. 3,673 రెగ్యులర్ డ్రైవర్, 1,813 కండక్టర్, 579 అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్, 207 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీలు, 179 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీలు, 280 డిప్యూటీ సూపరింటెండెంట్, 656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు సమాచారం.