News March 30, 2024

ఎల్లుండి జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల

image

జేఈఈ మెయిన్-2024 సెషన్-2 అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు NTA ప్రకటించింది. https://jeemain.nta.ac.in/ వెబ్‌సైట్‌లో వీటిని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 319 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 1 (BE/BTECH) పరీక్షలు ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో జరగనుండగా, పేపర్-2 పరీక్షలు ఏప్రిల్ 12న నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న ఫలితాలు రానున్నాయి.

Similar News

News March 28, 2026

చరణ్ లుక్.. ‘ఇది బాడీ కాదు.. బాక్సాఫీస్’ అంటున్న ఫ్యాన్స్

image

‘పెద్ది’ సినిమాలో పహిల్వాన్‌గా ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లుక్ SMను షేక్ చేస్తోంది. కుస్తీ పోటీలోని ఆయన రగ్గుడ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన HD ఫొటోను డైరెక్టర్ బుచ్చిబాబు పోస్ట్ చేశారు. కండలు తిరిగిన దేహంతో కుస్తీ పహిల్వాన్‌గా ఊరమాస్ లుక్ చూసి ‘ఇది బాడీ కాదు.. బాక్సాఫీస్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి చరణ్ మేకోవర్ మీకెలా అనిపించింది? కామెంట్ చేయండి.

News March 28, 2026

GK: భారత హాకీ విశేషాలు

image

⋆ భారత హాకీ సమాఖ్య స్థాపన-1925(గ్వాలియర్)
⋆ ఒలింపిక్స్‌లో తొలి గోల్డ్ మెడల్ సాధించింది-1928 (ఆమ్‌స్టర్‌డామ్)
⋆ 1928-1956 మధ్య వరుసగా 6 ఒలింపిక్స్ స్వర్ణాలు గెలిచింది
⋆ హాకీలో IND గెలిచిన ఒలింపిక్స్ మెడల్స్ 13 (8 గోల్డ్, 1 సిల్వర్, 4 బ్రాంజ్)
⋆ తొలి కెప్టెన్ జైపాల్ సింగ్ ముండా
⋆ భారత్ WC గెలిచిన సంవత్సరం-1975
⋆ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టిన రోజునే జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు

News March 28, 2026

తొక్కిసలాట మృతులకు నివాళి.. మెమోరియల్ ఏర్పాటు

image

IPL: RCB గెలుపు వేడుకల్లో జరిగిన తొక్కిసలాట మృతులకు నివాళులర్పిస్తూ చిన్నస్వామి స్టేడియం వద్ద KSCA మెమోరియల్ ఏర్పాటు చేసింది. గత జూన్ 4న జరిగిన ఘటనలో 11 మంది చనిపోగా వారిని గుర్తు చేసుకుంటూ ప్రాక్టీస్‌లో ప్లేయర్లు సైతం 11 నంబర్ జెర్సీలు ధరించారు. ఇక RCB ప్లేయర్లు ఇవాళ చేతికి నల్ల బ్యాండ్లు ధరించి ఆడనున్నారు. అలాగే చిన్నస్వామి స్టేడియంలో ఇకపై 11 సీట్లను ఖాళీగా ఉంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.