News June 12, 2024
ఎల్లుండి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి ఎల్లుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని ఆయన X(ట్విటర్) ద్వారా వెల్లడించారు. వరుసగా రెండోసారి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న కిషన్ రెడ్డి తనపై మోదీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. కాగా ఇవాళ అమిత్ షా, నడ్డా, మనోహర్ లాల్ ఖట్టర్ వంటి నేతలు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 4, 2026
ఫిబ్రవరి 04: చరిత్రలో ఈరోజు

☛ 1891: స్వాతంత్ర్య సమర యోధుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ జననం
☛ 1962: సినీ నటుడు రాజశేఖర్ జననం
☛ 1972: దర్శకుడు శేఖర్ కమ్ముల జననం
☛ 1974: సినీ నటి, పొలిటీషియన్ ఊర్మిళ జననం
☛ 2023: సింగర్ వాణి జయరాం మరణం(ఫొటోలో)
☛ వరల్డ్ క్యాన్సర్ డే
☛ శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం
News February 4, 2026
స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం: చంద్రబాబు

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్లాంట్ పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్త విధానాలతో అన్ని విభాగాల్లో కర్మాగారాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. మరోవైపు 2024 సెప్టెంబర్‌లో ఎదుర్కొన్న రూ.486 కోట్ల నష్టాల నుంచి గట్టెక్కి.. 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని స్టీల్ ప్లాంట్ సాధించింది.
News February 4, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


