News March 23, 2024

ఎల్లుండి మద్యం షాపులు బంద్

image

TG: హోళీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ఎల్లుండి వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించినా.. రహదారులపై గుంపులుగా తిరిగినా కేసులు నమోదు చేయనున్నారు. నగరంలో తిరిగే వాహనాలపై కానీ, జనాలపై కానీ రంగులు చల్లకూడదని పోలీసులు హెచ్చరించారు.

Similar News

News January 8, 2025

BREAKING: ఫలితాలు విడుదల

image

తెలంగాణ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఫలితాలను TGPSC విడుదల చేసింది. ఎంపికైన 171 మంది అభ్యర్థుల జాబితాను వెబ్‌సైటులో అందుబాటులో ఉంచింది. 2023 జులైలో TPBO ఉద్యోగాలకు రాత పరీక్ష జరగ్గా, అక్టోబర్ నుంచి డిసెంబర్ 23 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించింది. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News January 8, 2025

రేపటి నుంచి SAT20: భారత్ నుంచి ఒక్కడే

image

రేపటి నుంచి SAT20 టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి. క్లాసెన్, బట్లర్, జాన్సెన్, విల్ జాక్స్, మార్క్రమ్, మిల్లర్, జాసన్ రాయ్, డుప్లెసిస్, డికాక్, పూరన్, స్టొయినిస్, రషీద్ ఖాన్, పొలార్డ్, సామ్ కరన్, సాల్ట్, లివింగ్‌స్టోన్ వంటి స్టార్లు ఆడతారు. భారత్ నుంచి దినేశ్ కార్తీక్ మాత్రమే ఈ టోర్నీలో ఆడనున్నారు. పర్ల్ రాయల్స్ తరఫున ఆయన బరిలోకి దిగుతారు.

News January 8, 2025

చాహల్ భార్యతో సన్నిహిత ఫొటో: స్పందించిన కొరియోగ్రాఫర్

image

టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధనశ్రీతో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్‌ సన్నిహితంగా దిగిన ఫొటో SMలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతీక్ స్పందించారు. ‘ఎవరికైనా తమకు నచ్చిన కథలు, కథనాలు చెప్పుకునే స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఉంది. కానీ ఒక చిన్న ఫొటోను వేరేవిధంగా చూడడం దారుణం. అబ్బాయిలూ ఎదగండి’ అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.