News May 2, 2024
మిగతావారికి ఎల్లుండి పింఛన్ డబ్బులు: పంచాయతీరాజ్ శాఖ

AP: రాష్ట్రంలో 65,49,864 మంది పెన్షనర్లలో 63,31,470 మందికి పింఛన్ పంపిణీ పూర్తయిందని పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. 15,13,752 మందికి ఇంటికి వెళ్లి నగదు అందజేసినట్లు చెప్పింది. బ్యాంకు ఖాతాలకు మొబైల్ నంబర్ అనుసంధానం కాని 74,399 మందికి డబ్బులు జమ కాలేదని పేర్కొంది. వారందరికీ సచివాలయ సిబ్బంది ద్వారా ఈనెల 4న పంపిణీ చేస్తామని వెల్లడించింది.
Similar News
News January 4, 2026
2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం: మోదీ

2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. పదేళ్లలో ఫిఫా అండర్-17, హాకీ ప్రపంచ కప్ వంటి 20కి పైగా అంతర్జాతీయ ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించామని గుర్తుచేశారు. క్రీడారంగంలో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ.. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణతో పాటు, ఒలింపిక్స్‌ను నిర్వహించడమే లక్ష్యమని 72వ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలిపారు.
News January 4, 2026
చంద్రబాబు స్వార్థ రాజకీయాలతో రాయలసీమకు అన్యాయం: అంబటి

AP: TG CM రేవంత్‌రెడ్డితో చంద్రబాబు కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలు రాయలసీమకు మరణశాసనంగా మారాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. స్వార్థం కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకున్నారన్నారు. గతంలో ఆల్మట్టి, పోలవరం, ప్రత్యేక హోదా విషయంలోనూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. అధికారం కోసం AP ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్రాన్ని చంద్రబాబు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.
News January 4, 2026
విడాకులు ప్రకటించిన సెలబ్రిటీ కపుల్

జై భానుశాలి-మాహీ విజు దంపతులు విడాకులు ప్రకటించారు. 2011లో పెళ్లి చేసుకున్న వీరు వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కాగా జై హిందీలో అనేక సీరియల్స్‌లో నటించి, డాన్స్ ఇండియా డాన్స్, సరిగమప, సూపర్ స్టార్ సింగర్ తదితర షోలు హోస్ట్ చేశారు. BB 12, 13లలో పాల్గొన్నారు. ఇక BB13కూ వెళ్లిన మాహీ ‘తపన’ మూవీ, ‘చిన్నారి పెళ్లికూతురు, వసంత కోకిల’ తదితర ఒరిజినల్ వెర్షన్ సీరియల్స్‌లో నటించారు.


