News December 2, 2024

ఎల్లుండి ప్రోబా-3 ప్రయోగం

image

ఈ నెలలో ఇస్రో 2 ప్రయోగాలను చేపట్టనుంది. PSLV C59 రాకెట్ ద్వారా ESAకు చెందిన ప్రోబా-3 అనే శాటిలైట్‌ను 4వ తేదీన సా.4.08 గంటలకు ప్రయోగించనుంది. దీనిద్వారా సూర్యుడి వాతావరణంలోని బయటి, అత్యంత వేడిపొర అయిన సోలార్‌ కరోనాను అధ్యయనం చేయనుంది. స్పెయిన్, పోలాండ్, బెల్జియం, ఇటలీ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొననున్నారు. అలాగే 24వ తేదీన రిశాట్-1B సహా నాలుగు వాణిజ్యపరమైన ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది.

Similar News

News March 22, 2026

అమెరికా దాడుల్లో 20 రోజుల పాప మృతి!

image

అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌లోని ఖజ్విన్‌కు చెందిన 20 రోజుల పాప చనిపోయినట్లు ఇరానియన్ మీడియా సంస్థ ‘ఫార్స్ న్యూస్’ పేర్కొంది. US-అమెరికా దాడులు ప్రారంభించినప్పటి (ఫిబ్రవరి 28) నుంచి ఇప్పటివరకు ఇరాన్‌లో 1,400కి పైగా మరణాలు నమోదయ్యాయి. ఇందులో 200 మందికి పైగా పిల్లలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. యుద్ధంలో పసి ప్రాణాలు బలవ్వడం బాధాకరమని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.

News March 22, 2026

కొండచిలువల రక్తంలో బరువును తగ్గించే మాలిక్యూల్

image

బర్మీస్ కొండచిలువలు తమ శరీర బరువుకు సమానమైన ఆహారాన్ని తినగలవు. ఆ తర్వాత నెలలపాటు తిండి లేకుండా ఉండగలవు. ఇలాంటి అసాధారణ జీవక్రియకు వాటి రక్తంలోని pTOS మాలిక్యూల్ కారణమని స్టాన్‌ఫోర్డ్(US) సైంటిస్టులు గుర్తించారు. దీన్ని వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లలో వాడొచ్చని, ఊబకాయంపై పోరాటంలో ఇదొక కీలక మలుపు అని పేర్కొన్నారు. pTOSను ఎలుకలకు ఇవ్వగా అవి తక్కువ ఆహారం తిని 28 రోజుల్లోనే 9% బరువు తగ్గాయన్నారు.

News March 22, 2026

లక్ష్యాన్ని మించి రబీ సాగు!

image

AP: మొంథా, దిత్వా తుఫాన్లతో భారీ వర్షాలు కురిసినా రబీ సాగుకు ఆటంకం కలగలేదు. ఈ సీజన్‌లో 20.79L హెక్టార్లలో 22 పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా ఏకంగా 27.36L హెక్టార్లలో రైతులు పంటలు వేశారు. వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, అపరాలు, చిరు ధాన్యాలు, పొగాకు, నూనె గింజలను సాగు చేశారు. కృష్ణా, గోదావరి డెల్టాలతోపాటు నదులు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతోనే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.