News March 21, 2024
ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. జూన్ నెలకు సంబంధించి వృద్ధులు/దివ్యాంగుల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు అదే రోజు ఉదయం 11 గంటలకు దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని తెలిపింది. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను మార్చి 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది.
Similar News
News October 29, 2025
ధ్వజస్తంభం లేని గుళ్లలో ప్రదక్షిణ చేయకూడదా?

‘దాదాపు అన్ని ఆలయాల్లో గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. దీని ప్రతిష్ఠాపన వైభవంగా చేస్తారు. ధ్వజస్తంభం కూడా ఆలయ శక్తిలో భాగమే. అయితే కొన్ని ఆలయాల్లో ధ్వజస్తంభం ఉండదు. వాటిని వాయు ప్రతిష్ఠ ఆలయాలు అంటారు. అలాంటి చోట్ల నిత్య పూజ, నైవేద్యాలు తప్పనిసరి కాదు. ధ్వజస్తంభం ఉన్నా, లేకపోయినా గుడిలో ప్రదక్షిణ చేయవచ్చు. ఇంట్లో తులసి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే ఇది కూడా శుభప్రదం’ అని పండితులు చెబుతున్నారు.
News October 29, 2025
18 ఓవర్లకు కుదింపు

వర్షం ఆగిపోవడంతో ఆస్ట్రేలియా-భారత్ తొలి టీ20 మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.
*ఇన్నింగ్స్ 18 ఓవర్లకు కుదింపు
*ముగ్గురు బౌలర్లు 4 ఓవర్ల చొప్పున వేయొచ్చు
*ఇద్దరు బౌలర్లు 3 ఓవర్లు వేయొచ్చు
*పవర్ ప్లే 5.2 ఓవర్ల వరకు
> ప్రస్తుతం భారత్ స్కోర్ 5 ఓవర్లకు 43/1గా ఉంది. అభిషేక్ 19 రన్స్ చేసి ఔటయ్యారు. క్రీజులో గిల్ (16*), సూర్య (8*) ఉన్నారు.
News October 29, 2025
‘తులసి బాసో’ వరి రకం ప్రత్యేకతలు ఇవే

తులసి బాసో ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర దేశీయ వరి రకం. దీనిలో ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఖరీఫ్‌కి మాత్రమే అనువైన రకం. 135 రోజుల తర్వాత ఎకరాకు 15-18 క్వింటాళ్లు, రెండవ కోతకు 6-8 క్వింటాళ్లు, మూడో కోతకు 5-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొదటి కోతకి మూడో కోతకు గింజ పరిమాణం, సువాసన ఏమాత్రం తగ్గదు. ఎంతటి గాలులనైనా తట్టుకొని పంట ఒరగదు. రైతు ఫోన్ నెంబరు 6300027502, 9440809364.


