News March 20, 2024
కవిత పిటిషన్‌పై ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ఎల్లుండి విచారణ జరగనుంది. తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన బెంచ్ దీనిపై విచారించనుంది. కవిత తన పిటిషన్‌లో ఈడీని ప్రతివాదిగా చేర్చారు.
Similar News
News January 26, 2026
కొబ్బరిపాలతో చర్మ సంరక్షణ

వంటల్లో ఎక్కువగా వాడే కొబ్బరి పాలు సౌందర్య సంరక్షణలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్ చర్మంపై మృతకణాలను తొలగిస్తాయి. దాంతో పాటు ముడతలు, మచ్చలు తగ్గించి యవ్వన చర్మాన్ని ఇస్తాయి. మొటిమలు, ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే వీటిని జుట్టుకు పట్టిస్తే కుదుళ్లను దృఢంగా చేస్తాయని చెబుతున్నారు.
News January 26, 2026
నేడు భీష్మాష్టమి.. ఇలా చేస్తే సంతాన ప్రాప్తి!

మాఘ శుద్ధ అష్టమి(భీష్మాష్టమి) రోజునే భీష్ముడు మోక్షం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన ఆయనకి తర్పణం సమర్పిస్తే ఉత్తమ సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘తండ్రి బతికున్న వారు కూడా ఈ తర్పణం సమర్పించవచ్చు. తెలుపు దుస్తులతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే పుణ్యఫలాలు లభిస్తాయి’ అని సూచిస్తున్నారు. భీష్మ తర్పణం ఎలా సమర్పించాలి, భీష్మ అష్టోత్తర వివరాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News January 26, 2026
బీర పంటకు నీటిని ఇలా అందిస్తే మేలు

బీర విత్తనాలను నాటడానికి ముందు పొలంలో నీరు పెట్టాలి. తర్వాత ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3-5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు నాలుగైదు రోజులకు ఒకసారి నీరు అందించాలి. మొక్కకు దగ్గరగా కాకుండా కాస్త దూరంలో ఎరువు వేయాలి. తర్వాత ఎరువుపై మట్టిని కప్పి నీటిని పెట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.


